
Anasuya Bharadwaj: అనసూయ ఎక్కడలేని సోషల్ మీడియా నెగిటివిటీ ఫేస్ చేస్తుంది. ఆమె మాట తీరు, చర్యలు నచ్చని జనాలు చాలా మంది ఉన్నారు. పలు వివాదాలు అనసూయ పట్ల వ్యతిరేకతకు కారణమయ్యాయి. అనసూయ ఏం పోస్ట్ చేసినా ట్రోల్ చేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఇక వాలైంటైన్స్ డే నాడు ఆమె మనసు నొచ్చుకునేలా చేశారు ఒకరు. దీంతో అతనితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య కామెంట్స్ వార్ నడిచింది.
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా భర్తతో దిగిన ఒక స్టైలిష్ ఫోటో అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దానికి ”నీతో జీవితం పిచ్చెక్కించే రోలర్ కోస్ట్ రైడ్ వంటిది” అని క్యాప్షన్ ఇచ్చింది. అనసూయ ఫోటో వైరల్ గా మారింది. నెటిజన్స్ ఎప్పటిలాగే నెగిటివ్, పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఒకరు మాత్రం ”అదేం లేదులే అక్కా వాడి దగ్గర బాగా డబ్బుంది, దట్స్ ఇట్’ అని కామెంట్ చేశాడు. నువ్వు భరద్వాజ్ తో ఉండటానికి కారణం డబ్బే, ప్రేమ అనుబంధం ఏం లేవు అనే అర్థంలో నెటిజన్ ఆ కామెంట్ చేశాడు.

ఆ మాట అనసూయకి ఎక్కడలేని కోపం తెప్పించింది. ‘అదేంట్రా తమ్ముడు అంత మాట అనేశావ్. డబ్బేమిట్రా? ఎంత ఉందేంటి? అక్క దగ్గరలేదా డబ్బు ? అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేవి కూడా ఉన్నాయేంట్రా? బావగారికి పట్టుకొని వాడు వీడు ఏంట్రా మర్యాద లేకుండా. ఏం పెంపకంరా తమ్ముడు నీది. చెంపలు వేసుకో, లేదంటే నేనే చెప్పుతో కొడతా…’ అని ఘాటైన సమాధానం ఇచ్చింది. సదరు నెటిజన్ తిరిగి ”సమర్ధించుకోకు. రియాలిటీ మాట్లాడు. నీ భవిష్యత్ భద్రత కోసం ఒక డబ్బున్న వాడిని పెళ్లి చేసుకున్నావ్ అనే అర్థంలో అన్నాను” అని ఆ నెటిజన్ అన్నాడు.
‘నీ బొందరా నీ బొందర… అన్నీ తెలిసిన అంతర్యామిలా మాట్లాడకు. ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకో. పచ్చ కామెర్లు ఉన్నోళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నీకు డబ్బు పిచ్చి, ఇక అందరూ అదే అనుకుంటున్నావు. నీ బుద్ధి మార్చుకో. గెట్ వెల్ సూన్. తమ్ముడివి కదా నీ మంచికే చెబుతున్నా..’ అంటూ మరో రిప్లై ఇచ్చింది. ఇంస్టాగ్రామ్ వేదికగా జరిగిన ఈ కామెంట్స్ వార్ సోషల్ మీడియా జనాలను ఆకర్షించింది. ప్రతి ఒక్కరి కామెంట్స్ కి స్పందించడం పెంట మీద రాయి వేయడమే, వదిలేయండని కొందరు అనసూయకు సలహా ఇస్తున్నారు.
Also Read: Ram Charan Instagram Post: దేశాన్ని ఊపేస్తున్న రామ్ చరణ్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ రీల్