Sudigali Sudheer- Anasuya Bharadwaj: అనసూయ యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. ఆమెకు గర్వం కూడా తలకెక్కినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. సుడిగాలి సుధీర్ తో పని చేశారు కదా, ఆ అనుభవం ఎలా ఉంది? అని రిపోర్టర్ అడిగే, అతడు నాకంటే జూనియర్ అంటూ అవాకులు చవాకులు పేల్చింది. అనసూయ జబర్దస్త్ మానేసిన సంగతి తెలిసిందే. నటిగా ఆఫర్స్ వస్తున్న తరుణంలో అనసూయ జబర్దస్త్ తో పాటు బుల్లితెర షోస్ కి యాంకరింగ్ చేయడం వదిలేశారు. మనం ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు.

ప్రస్తుతం అనసూయ బహుశా పెద్ద స్టార్ హీరోయిన్ లా ఫీల్ అవుతున్నట్లుంది. సుడిగాలి సుధీర్ నా జూనియర్ అనేసింది. జూనియర్ అనడంలో తప్పు లేదు. ఆమె చెప్పిన కాంటెక్స్ట్ చూస్తే తనని తాను ఎక్కడో ఊహించుకుంటుందని తెలుస్తుంది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయను రిపోర్టర్.. మీరు యాంకర్ గా సుధీర్ తో పని చేశారు? ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అని అడిగారు. సుధీర్ తో పని చేసిన అనుభవం గురించి అడిగితే… ఆమె హర్ట్ అయ్యారు. అది మనసులో దాచుకోకుండా బయటపడ్డారు.
సుధీర్ నాకంటే జూనియర్ ఆ విషయం మరిచిపోయారా? నాతో పని చేసిన అనుభవం ఎలా ఉందో, సుధీర్ ని అడిగి తెలుసుకోండి, అన్నారు. అనసూయ సమాధానానికి రిపోర్టర్ షాక్ అయ్యాడు. మరి సుధీర్ హర్ట్ అవుతాడని ఏమైనా భావించిందో ఏమో… సుధీర్ హార్డ్ వర్కింగ్, టాలెంటెడ్ అంటూ కొంచెం తాలింపు తగిలించి వదిలేసింది. అసలు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సుధీర్ జూనియర్ అని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరు జూనియర్, ఎవరు సీనియర్ అనే ప్రస్తావన రాలేదు. జస్ట్ ఆయనతో పని చేసిన అనుభవం ఏమిటని అడిగారు.

అనసూయ అసందర్భంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ మాటకు వస్తే సుడిగాలి సుధీర్ ఫ్యాన్ బేస్ ఆమె కంటే చాలా ఎక్కువ. ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసినా ఒక్క హిట్ లేదు. సుడిగాలి సుధీర్ ఇటీవల గాలోడు మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. గాలోడు సినిమా మంచి లాభాలు తెచ్చింది. అలాంటి సుధీర్ ని పట్టుకొని పరోక్షంగా అనసూయ నామ్ ముందు బచ్చా అనేసింది. ఈ నోటి దూలే అనసూయను వివాదాల్లోకి నెడుతున్నాయి. లైగర్ మూవీ ప్లాప్ అయితే సంబర పడాల్సిన అవసరం ఏమిటీ? ఎప్పుడో 2017 లో జరిగిన మాదర్** కాంట్రవర్సీ మళ్ళీ తెరపైకి తేవడం ఎంత వరకు కరెక్ట్. అందలం ఎక్కాం కదా అని ఎగిరెగిరి పడితే ఏదో రోజు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.