Homeట్రెండింగ్ న్యూస్Anand Mahindra Tweet: మనకు తెలియని ఇండియా గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

Anand Mahindra Tweet: మనకు తెలియని ఇండియా గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

Anand Mahindra Tweet: ఆనంద్ మహీంద్రా.. ఈ దిగ్గజ వ్యాపారవేత్త గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమొబైల్ విభాగంలో దేశంలోనే అత్యున్నత పెద్దదైన మహీంద్రా కంపెనీకి చైర్మన్. ఐటీ రంగంలోనూ సత్యం కంపెనీని టేక్ ఓవర్ చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఫైనాన్స్ విభాగంలోనూ సత్తా చాటుతున్నారు. అలాంటి ఈ వ్యాపారవేత్తకు ఊపిరి తీసుకునే సమయం కూడా తనకు లేకపోయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. సమయం దొరికితే నాటు నాటు అనే పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తారు.. ఇక వేలాది కోట్ల రూపాయలకు అధిపతి అయిన ఈ వ్యాపారవేత్తలో సగటు భారతీయుడు ఉన్నాడు. భారతీయతకు ఉప్పొంగే సామాన్య మానవుడు ఉన్నాడు. తులతూగే సిరిసంపదలు ఉన్నప్పటికీ ఈయన మనసు ఇప్పటికీ ఇండియా మీదనే చక్కర్లు కొడుతూ ఉంటుంది.. టైం దొరికితే చాలు వెకేషన్ అంటూ ప్లాన్ చేసుకునే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు భిన్నంగా ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తున్నారు. వెలుగులోకి రాని ఇండియా అందాలను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేస్తున్నారు. అంతేకాదు ఈ అందాలను తనివి తీరా ఆస్వాదించేందుకు ఒక పెద్ద జాబితా కూడా రూపొందించుకున్నానని గర్వంగా చెబుతున్నారు.

రీ ట్విట్ చేశారు

సామాజిక మాధ్యమాల్లో ఆనంద్ మహీంద్రా చాలా చురుగ్గా ఉంటారు. ఏదైనా తనకు నచ్చిన అంశం ఉంటే వెంటనే షేర్ చేస్తారు. తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. ” కలర్స్ ఆఫ్ భారత్” అనే ఓ ట్విట్టర్ ఖాతా లో ఫోటోలను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అంతేకాదు వాటిని ఉద్దేశించి ఇలాంటి ఇండియాను నేను చూడాలి అనుకుంటున్నాను అని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ గ్రూపులో హిమాచల్ ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారతదేశంలో పది అత్యంత అందమైన గ్రామాలను ఆనంద్ వివరించారు.. కేరళ రాష్ట్రంలోని కొల్లెం గోడ్, తమిళనాడులోని మాధూర్, కర్ణాటకలోని వరంగా, బెంగాల్ లోని గోర్ఖే ఖోలా, ఒడిశాలోని జిరాంగ్, అరుణాచల్ ప్రదేశ్ లోని జిరో, రాజస్థాన్లోని ఖిమ్ సర్, ఉత్తరా ఖాండ్ లోని మన అనే గ్రామాల గురించి ఆనంద్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ” కలర్స్ ఆఫ్ భారత్” అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ గ్రామాల గురించి తెలుసుకున్న ఆయన.. వాటిని కచ్చితంగా సందర్శిస్తానని నెటిజన్లకు మాట ఇచ్చాడు. ” ఇలాంటి అందమైన ఇండియా నన్ను అనుక్షణం అబ్బురపరుస్తోంది. కచ్చితంగా ఈ అందాలను నేను చూడాల్సిందే అంటూ” ఆయన వ్యాఖ్యానించారు.” మన చుట్టూ ఉన్న అందం నన్ను మాట్లాడకుండా చేసింది. భారత దేశంలో ప్రయాణానికి నా బకెట్ జాబితా ఇప్పుడు పొంగిపొర్లుతోంది” అంటూ ఆనంద్ ఉద్వేగంగా ట్వీట్ చేశారు.

మూడు లక్షల వీక్షణలు

ఎప్పుడైతే ఆనంద్ మహీంద్రా కలర్స్ ఆఫ్ భారత్ ఖాతాలో ఫోటోలు షేర్ చేశారో.. అప్పటినుంచి ఆ ఖాతా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా నిలిచింది. ఆనంద్ షేర్ చేసిన వెంటనే అది మూడు లక్షల వీక్షణలు సొంతం చేసుకుంది. ఇక ఆనంద్ షేర్ చేసిన వెంటనే నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ” భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక వారసత్వానికి ఆలవాలమైన ఇండియా మిమ్మల్ని ఆకర్షించింది. ఇక ఆలస్యం ఎందుకు? అంత అందమైన ఇండియాను మీరు చూసేయాల్సిందే” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు.” మీరు షేర్ చేసిన చిత్రాలు చాలా బాగున్నాయి. అక్కడ అంత మంచి అందాలు ఉన్నాయని మీ ద్వారా తెలుసుకుందాం. కచ్చితంగా ఆ ప్రాంతాలను సందర్శిస్తాం” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. ” బయటి దేశాలకు వెళ్లడం ఎందుకు? మన దగ్గరే ఇంతటి ప్రకృతి రమణీయత ఉన్నప్పుడు?” అని ఓ యువ టెకీ చెప్పాడు. కాగా ఆనంద్ చేసిన ఈ రీ ట్వీట్ వైరల్ గా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular