Anand Mahindra On Dashrath Manjhi: ఈరోజు జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఇంజనీర్లు ఈరోజును ఘనంగా జరుపుకుంటారు. ఇంజనీర్ లేనిది మనిషి జీవితం లేదు కాబట్టి.. వారికి ప్రతిరోజు కూడా ఒక దినోత్సవం లాంటిదే. అయితే ఇంజనీర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఆయన తెలిపిన శుభాకాంక్షలు, ఇంజనీర్ల ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇంతకీ ఆనంద్ మహీంద్రా పరిచయం చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా?
ఇంజనీర్ల దినోత్సవం నాడు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఒక ట్వీట్ షేర్ చేశారు. ” ఈయన చదువుకోలేదు. కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. ఆంగ్లం మీద పట్టు లేదు. కానీ కొండను తొలిచాడు. ఏకంగా ఒక మార్గాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఆ మార్గం చాలామందికి ఉపయోగపడుతోంది. ఇతడి మేథో శక్తి ముందు ఏదైనా దిగదుడుపే..” అంటూ రాసుకు వచ్చాడు. ఇంతకీ ఆనంద్ రీ ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరంటే.. దేశంలో మౌంటెన్ మ్యాన్ గా పేరుపొందిన దశరథ్ మంజీ. 1934లో బీహార్ రాష్ట్రంలోని గెహ్లోర్ ప్రాంతంలో జన్మించాడు. పేద కుటుంబం కావడంతో చదువుకునే అవకాశం లభించలేదు.. పైగా చిన్నప్పటినుంచే పనుల్లోకి వెళ్ళేవాడు. ధన బాద్ లో బొగ్గు గనుల్లో అతడు పని చేసే వాడు. ఇతడికి ఫల్గుణి దేవి అనే అమ్మాయితో వివాహం జరిగింది. దశరథ్ మంజీ ఉండే గెహ్లోర్.. బీహార్ రాజధాని పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బయట ప్రపంచానికి ఆ గ్రామానికి మధ్య ఒక కొండ అడ్డంగా ఉంటుంది. నిత్యవసరాలు కొనుగోలు చేయాలన్నా, అవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాలన్నా కొండ చుట్టూ తిరిగి వెళ్లాలి. దాదాపు 32 కిలోమీటర్ల దూరం. ఏళ్ల నుంచి ఇదే దురవస్థ. ఒకవేళ ఈ కొండను కనుక పూర్తిస్థాయిలో తొలిస్తే ఆ దూరం మూడు కిలోమీటర్లకు తగ్గుతుంది. అయితే అప్పట్లో మాంజీ ఓ భూస్వామి వద్ద కారులో పనిచేసేవాడు. అతని భార్య రోజు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చేది. అయితే కొండ ఇవతలికి వచ్చేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. ఈ వైపు రావాలి అంటే కొండెక్కి దిగాల్సిందే. ఇందుకు కొన్ని గంటల సమయం పడుతుంది.. ఒకరోజు మాంజి భార్య ఆహారం తీసుకొని వస్తుండగా కొండమీది నుంచి పడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆలసంగా వచ్చిన భార్యను కొట్టాలనే కసితో ఉన్న మాంజి.. తన భార్య పరిస్థితి చూసి గురయ్యాడు. అలా 3 అడుగుల ఎత్తైన కొండ నుంచి రాయిని తులసి మార్గాన్ని ఏర్పాటు చేసే పనికి శ్రీకారం చుట్టాడు.
ఇందుకు గానూ తన వద్ద ఉన్న గొర్రెలను అమ్మి సమ్మెట, ఉలి, గునపాలను కొనుగోలు చేశాడు. ఈ పనిముటతో కొండపైకి ఎక్కి తవ్వడం ప్రారంభించాడు. ఇలా కొండను తవ్వుతున్న మాంజీని చూసి గ్రామస్తులు నవ్వేవారు.. ఇలా మాంజి కొండను తవ్వడం వల్ల ఇతర పనులకు వెళ్లేవాడు కాదు. ఫలితంగా ఇల్లు గడిచేది కాదు. దీంతో అతని భార్య పస్తులు ఉండేది. అయితే ఒకసారి ఆమె అనారోగ్యానికి గురైంది. కొండ అడ్డుగా ఉండటంవల్ల సకాలంలో ఆసుపత్రికి తరలించలేకపోయాడు మాంజి. దీంతో ఆమె చనిపోయింది. భార్య మరణంతో మాంజీలో పట్టుదల మరింత పెరిగింది. పదేళ్ళు శ్రమించి కొండను చీల్చాడు. అతడి శ్రమను గుర్తించిన కొంతమంది ఆ చీలిక నుంచి రోడ్డు వేసేందుకు ముందుకు వచ్చారు. 1982లో ఆ మార్గానికి సుగమం అయింది. అంటే ఈ మార్గాన్ని సృష్టించేందుకు 22 ఏళ్ల పాటు మాంజీ కృషి చేశాడు. ఒక నిరుపేద కూలి ఒక పర్వతాన్ని జయించాడు. 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న తను పిప్పి చేశాడు. అతడి కృషి ఫలితంగా సుమారు 60 గ్రామాల ప్రజలకు పాట్నా దగ్గర అయింది. ఇతడు కొండను తొలవడంతో మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా వినతికెక్కాడు. ఇతడి ఘనత తెలుసు కాబట్టే ఆనంద్ మహీంద్రా.. ఈ తరం ఇంజనీర్లకు పరిచయం చేశాడు. ఆనంద్ మహీంద్రా చేసిన రీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంజనీర్ల దినోత్సవం రోజు అద్భుతమైన ఇంజనీర్ ను మాకు పరిచయం చేశారంటూ వారు కొనియాడుతున్నారు.
On #EngineersDay2023 I bow low to this man. No, he wasn’t an engineer. No, he didn’t graduate from any Institute of Technology. No he wasn’t even computer literate nor did he design any machines. But he believed what every true Engineer believes:: “NOTHING is impossible.” https://t.co/zwyDe4Swr0
— anand mahindra (@anandmahindra) September 15, 2023