Anand Mahindra : మనల్ని పాలించిన బ్రిటీషోళ్లను దాటేశాం.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే

Anand Mahindra : బ్రిటీష్ రాచరిక పాలనలో మనం 200 ఏళ్లకు పైగా మగ్గాం. బ్రిటీషర్లు మన కోహినూర్ వజ్రం నుంచి మొదలుపెడితే మన సంపదనంతా దోచుకుపోయారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే పీల్చి పిప్పి చేశారు. చివరకు స్వాతంత్ర్యం ఇచ్చి గుల్ల చేసి వెళ్లిపోయారు. అలాంటి ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న భారత దేశం ఇప్పుడు ఈ 75 ఏళ్ల తర్వాత మనల్ని పాలించిన బ్రీటీషర్లను అధిగమించింది. ఇదొక అద్భుతమైన ఘనత అనే చెప్పొచ్చు. భారతదేశం […]

Written By: NARESH, Updated On : September 4, 2022 4:06 pm
Follow us on

Anand Mahindra : బ్రిటీష్ రాచరిక పాలనలో మనం 200 ఏళ్లకు పైగా మగ్గాం. బ్రిటీషర్లు మన కోహినూర్ వజ్రం నుంచి మొదలుపెడితే మన సంపదనంతా దోచుకుపోయారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే పీల్చి పిప్పి చేశారు. చివరకు స్వాతంత్ర్యం ఇచ్చి గుల్ల చేసి వెళ్లిపోయారు. అలాంటి ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న భారత దేశం ఇప్పుడు ఈ 75 ఏళ్ల తర్వాత మనల్ని పాలించిన బ్రీటీషర్లను అధిగమించింది. ఇదొక అద్భుతమైన ఘనత అనే చెప్పొచ్చు.

భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి అన్ని దేశాలపై దోచుకొని బలపడిన బ్రిటన్ ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైంది. అక్కడ ఉద్యోగ, ఉపాధి కరువైంది. అందుకే దాని జీడీపీ పడిపోయింది. కానీ మన భారతావని మాత్రం కరోనాను తట్టుకొని నిలబడింది. మోడీ సర్కార్ చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా ముందుకు సాగుతోంది.

ఈ క్రమంలోనే ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. టాప్ 5లో ఉన్న బ్రిటన్ దేశాన్ని అధిగమించేంది. మనల్ని పాలించిన బ్రిటన్ ను అధిగమించి బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్ తీరును ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కొనియాడారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశాడు.

భారత్ బ్రిటన్ ను వెనక్కి నెట్టి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంపై ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో ఆసక్తికరంగా స్పందించారు. ‘కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో కష్టపడి పోరాడి, త్యాగాలు చేసిన ప్రతి భారతీయుడి హృదయం ఈ వార్తతో ఉప్పొంగిపోతుంది. అంతేకాక.. భారత్ కష్టాలు పడుతుందని భావించిన వారందరికీ ఇదో గట్టి సమాధానం’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

బ్రిటీష్ వారు 200 ఏళ్లు మనపై పడి దోచుకున్నా.. కేవలం 75 ఏళ్లలో మనం వారిని అధిగమించామంటే ఇది ఖచ్చితంగా గొప్పతనమే. భారతీయుల కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం అని చెప్పొచ్చు.

https://twitter.com/anandmahindra/status/1565762702425096192?s=20&t=Ljqko0BB3XKiEemO0w9tQA