Photo Story: ఈ ఇద్దరు తెలంగాణ ప్రభుత్వంతో కీలక మంత్రులు.. ఈ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఈ ఇద్దరు దగ్గరి బంధువులు.. ఇప్పుడు వీళ్లే తెలంగాణను ఏలుతున్నారు.. చిన్ననాటి సంగతులు ఒక్కోసారి గుర్తు చేసుకుంటే ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా ఉండడంతో ఆశ్చర్యపోతుంటాం. మన ఫేస్ ను చాలా రోజుల తరువాత చూసుకుంటే మనకే కొత్తగా కనిపిస్తుంది. ఇలాంటి ఆనందాన్ని పొందడానికి చాలా మంది ఫొటోలు తీసుకొని భద్రపరుచుకుంటూ ఉంటారు. ఒక్క ఫొటో ఆనాటి సంగతులను మొత్తం చెప్పేస్తుంది. 100 పేజీల పుస్తకం కన్నా ఒక్క ఫొటోలో స్టోరీని మొత్తం చెప్పొచ్చు అని అంటారు. అందుకే అప్పటికీ, ఇప్పటికీ ఫొటోకు వాల్యూ అలాగే ఉంటోంది. అలా నాటి కాలంలో చాలా మంది ఫొటోలను తీసుకొని భద్రపరుచుకున్నారు. ఇప్పుడు వాటిని వెలికి తీస్తూ ఆకర్షిస్తున్నారు.
ఇప్పుడీ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో ఉన్న ఇద్దరు ఎవరో తెలుసా? ఒకరు కేటీఆర్, మరొకరు హరీష్ రావు. ఫొటో చూడగానే రైట్ సైడ్ ఉన్నది హరీష్ రావు అని చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్ లో ఉన్న ది కేటీఆర్. కానీ ఆయన గుర్తుపట్టకుండా ఉన్నారు. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. హరీష్ రావు వైద్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు బావ, బావమరుదులు అవుతారన్న విషయం తెలంగాణ సమాజానికి తెలుసు.
కేటీఆర్ జూలై 24న జన్మించారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఆనాటి పాత ఫొటోలను బయటకు తీస్తున్నారు. అలా వచ్చిన ఈ ఫొటో సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. కల్వకుంట్ల తారకరామావు 1976 లో సిద్ధిపేటలో జన్మించారు. అమెరికా సిటీ యూనివర్సిటీలో పూర్తి చేసి, అక్కడ ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్లపాటు జాబ్ చేశారు. 2004లో ఈ ఉద్యోగాన్ని వదిలి తెలంగాణకు వచ్చారు. ఆ తరువాత తండ్రి కేసీఆర్ తో పాటు రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సిరిసిల్ల నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేసి గెలిచిన కేటీఆర్ ఇప్పటి వరకు ఓడిపోకపోవడం విశేషం.
రాజకీయంలో కొనసాగుతున్న కేటీఆర్ అందరిలా కాకుండా ప్రత్యేకంగా నిలుస్తారు. ఓ వైపు అభివృద్ధితో పాటు మరోవైపు ప్రజలతో మమేకమే కనిపిస్తారు. ఒకప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యగా ఉన్న సిరిసిల్లకు ‘ఉరి’సిల్లగా పేరుండేది. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం సిరిసిల్ల వైపు చూస్తుందంటే అందుకు కారణం కేటీఆర్ అని చెప్పుకోవచ్చు. అభివృద్ది మాత్రమే కాకుండా పెట్టుబడులను రాష్ట్రానికి తేవడంలో కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు.