Homeట్రెండింగ్ న్యూస్IBM Employee: 15 సంవత్సరాలుగా సెలవులో ఉన్నాడు.. జీతం పెంచలేదని ఐబీఎం కంపెనీ పై దావా...

IBM Employee: 15 సంవత్సరాలుగా సెలవులో ఉన్నాడు.. జీతం పెంచలేదని ఐబీఎం కంపెనీ పై దావా వేశాడు

IBM Employee: సాధారణంగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగులకు హక్కులు అంతంత మాత్రమే ఉంటాయి. ఇక సాప్ట్ వేర్ ఉద్యోగులకు హక్కులు ఉన్నప్పటికీ అవి అంతగా అమలు కావు. ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఉద్యోగుల మెడ పట్టి బయటకి గెంటేస్తాయి. వాళ్లకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు విచ్చేసి చేతులు దులుపుకుంటాయి. అయితే నిన్న మొన్నటి వరకు మనం ఇలాంటి వార్తలే చూశాం. చదివాం కూడా. అయితే ఒక వ్యక్తి ఏకంగా ఐబీఎం కంపెనీ పై దావా వేశాడు.. దీనికి అతడు కోర్టుకు చెప్పిన కారణం జీతం పెంచలేదని.. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

ఐబీఎం కంపెనీలో ఘటన

ప్రముఖ టెక్ కంపెనీ అయిన ఐబీఎం లో ఇయాన్ క్లిఫోర్డ్ అనే వ్యక్తి సీనియర్ ఐటి ఉద్యోగి. జీతం అప్పట్లోనే ఇతడికి ఐదు అంకెల్లో వచ్చేది. విలాసవంతమైన జీవితం గడిపేవాడు.. అలాంటి ఇతడు 2008 సెప్టెంబర్ నెలలో అనారోగ్యాన్ని గురయ్యాడు.. అతడు అప్పటినుంచి సిక్ లీవ్ లో ఉన్నాడు. ఎన్ని ఆసుపత్రులలో చూపించినప్పటికీ అతనికి నయం కాలేదు.. అయితే 2013లో కంపెనీ సరైన ప్రయోజనాలు కల్పించకపోవడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.. అక్కడి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో అతడితో ఐబీఎం కంపెనీ సమగ్ర ఒప్పందం కుదుర్చుకుంది. ఆ దేశ చట్టాల ప్రకారం అతడు కంపెనీలో పని చేయనప్పటికీ ఉద్యోగ నుంచి తొలగించబో మని హామీ ఇచ్చింది.. సిక్ లీవ్ లో ఉన్నప్పటికీ ఉద్యోగిగానే పరిగణిస్తూ వేతన ప్యాకేజీ 72,037 పౌండ్లలో 75% మేర అంటే ఏటా 54 వేల పౌండ్లు భారతదేశ కరెన్సీలో 55.31 లక్షలు చెల్లిస్తున్నది. అతడి ఉద్యోగ విరమణ వయసు అంటే 65 సంవత్సరాలు వచ్చేవరకు ఇలా చెల్లిస్తామని ప్రకటించింది.. 2013 లో అతడు బ్రిటన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పుడు… ఐబీఎం ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. అయితే మళ్ళీ అది అర్థం కాకుండా ఉండేందుకు సదరు ఉద్యోగికి 8,685 పౌండ్లు భారత కరెన్సీలో తొమ్మిది లక్షలు అదనంగా చెల్లించింది.

ఇయాన్ క్లిఫోర్డ్ మళ్లీ ఫిర్యాదు చేశాడు

అయితే గత పది సంవత్సరాలుగా లండన్ లో తన జీవన వ్యయం భారీగా పెరిగిందని, ఐబీఎం కంపెనీ తనకు ఇచ్చే వేతనం చాలా తక్కువ అని ఇయాన్ వాపోయాడు.. అంతేకాదు తనతో కుదుర్చుకున్న ప్లాన్ ప్రకారం ఇచ్చే వేతనం పెంచాలని డిమాండ్ చేశాడు.. సంబంధించి సంస్థకు ఒక లేఖ రాశాడు. అయితే సంస్థ నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో 2022 ఫిబ్రవరిలో బ్రిటన్ ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాడు. తన అనారోగ్యం పట్ల ఐబీఎం కంపెనీ వివక్ష చూపిస్తోందని ఆరోపించాడు..అయితే ఇయాన్ వేసిన పిటిషన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ” అతడికి మెరుగైన చికిత్స తో పాటు కుటుంబ నిర్వహణ నిమిత్తం ఆర్థిక ప్యాకేజీ కూడా ఇచ్చిందని”ఐబీఎం తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. బ్రిటన్ కార్మిక చట్టాల ప్రకారం యాక్టివ్ ఉద్యోగులకు వేతనం పెంపు ఉంటుందని, యాక్టివ్ గా లేని ఉద్యోగులకు వేతన పెంపు వర్తించదని ఆ న్యాయవాది కోర్టులో వాదించారు.. అయితే పెరుగుతున్న ధరల దృష్ట్యా ఆ ఉద్యోగికి పదేళ్ల కిందట కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇస్తున్న ప్యాకేజీ సరిపోకపోవచ్చు అని ఐబిఎం తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఆ ఉద్యోగికి ఉన్న అనారోగ్యం దృష్ట్యా ఐబీఎం కంపెనీ చాలా ఉదారతతో వ్యవహరిస్తుందని న్యాయవాది వెల్లడించారు. అతడి అనారోగ్యాన్ని ఐబీఎం సంస్థ చిన్నచూపు చూసిందని ఆరోపించడంలో అర్థం లేదని ఐబీఎం తరఫున న్యాయవాది వాదించారు. అయితే వాదోపవాదాలు విన్న కోర్టు ఇయాన్ చేసిన విన్నపాన్ని తిరస్కరించింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular