Bizarre Incident:వీడి తెలివి తెల్లారినట్టే ఉంది. అమ్మాయితో ఎంజాయ్ చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ అమ్మాయి పట్టేంత పెద్ద సూట్ కేసు కొని అందులో ఆమెను పెట్టి బాయ్స్ హాస్టల్ కు తీసుకెళ్లాడు ఓ ఇంజినీరింగ్ విద్యార్థి. సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా అమ్మాయిని హాస్టల్ కు ఇలా తీసుకెళుతూ ఉన్నాడు. విచిత్రంగా ఉన్న ఈ ఘటన మణిపాల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో జరిగింది.
కర్ణాటకలోని మణిపాల్ లో ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ ను బాయ్స్ హాస్టల్ లోకి దొంగచాటుగా తీసుకెళ్లేందుకు ఆమెను ట్రావెలింగ్ బ్యాగ్ లో దాచాడు. ఈ క్రమంలోనే హాస్టల్ లోకి ఎంటర్ అయ్యే సమయంలో అక్కడే ఉన్న వార్డెన్ కు అనుమానం వచ్చింది.
బ్యాగ్ లో ఏముందని ప్రశ్నించగానే సదురు విద్యార్థి తడబడుతూ ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వస్తువులు ఉన్నాయని చెప్పాడు. వార్డెన్ కు ఎందుకో అనుమానం వచ్చి బ్యాగ్ ను ఓపెన్ చేసి చూడగా.. అందులో ఓ అందమైన అమ్మాయి కనిపించింది.
బ్యాగ్ లో అమ్మాయిని చూసి వార్డెన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ అమ్మాయి అదే ఇంజనీరింగ్ కాలేజీలోనే విద్యనభ్యసిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన హాస్టల్ అధికారులు వెంటనే ఇద్దరినీ హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారట.. మనోడు తెలివికి ఆ కాలేజీ మొత్తం అవాక్కైందట..
-మణిపాల్ సూట్ కేసు లవ్ పై వెల్లువెత్తిన మీమ్స్
ఇక మణిపాల్ హాస్టల్ లో లవర్ ను ఇలా సూట్ కేసులో తీసుకెళ్లిన ఇంజనీరింగ్ స్టూడెంట్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఆ పని కోసం అంత కష్టపడాలా నాయనా’ అని కొందరు ట్విట్టర్ లో ట్రోల్ చేశారు. ఇకొందరు సుకుమారమైన లేడిని అలా సూట్ కేసులో తీసుకెళుతావా? అని ఎద్దేవా చేశారు. ‘అయినా ఆ అమ్మాయి సూట్ కేసులో రావడానికి ఎలా ఒప్పుకుందబ్బా’ అని మరికొందరు సెటైర్లు వేశారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
https://twitter.com/justbhavyaugh/status/1488856519705694209?s=20&t=yzbuRdX088SIH1wKofyHsQ