
Amigos First Day Collection: నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది..టీజర్ మరియు ట్రైలర్ ద్వారా ఈ సినిమా అభిమానుల్లో ఎలాంటి అంచనాలను సెట్ చేసిందో ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది.కానీ కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.కళ్యాణ్ రామ్ నుండి ఓపెనింగ్స్ ఆశించలేము కానీ ‘భింబిసారా’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కనీస స్థాయిలో అయినా ఉంటుందని అనుకున్నారు, కానీ ‘అమిగోస్’ కి డిజాస్టర్ రేంజ్ ఓపెనింగ్స్ దక్కాయి..చాలా చోట్ల అసలు కొత్త సినిమాకి రావాల్సిన కనీస స్థాయి ఓపెనింగ్ కూడా ఈ చిత్రానికి దక్కలేదు..కారణం జానర్..మన ఆడియన్స్ కరోనా లాక్ డౌన్ తర్వాత ఎక్కువగా కమర్షియల్ సినిమాలకే కనెక్ట్ అవుతున్నారు, అంటే మిగిలిన సినిమాలు ఆడటం లేదని చెప్పట్లేదు కానీ , కమర్షియల్ సినిమాలకు ఓపెనింగ్స్ మైలేజ్ ఎక్కువ.
అయితే మొత్తం మీద ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము..ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకంటే ఓవర్సీస్ లో కాస్త డీసెంట్ ఓపెనింగ్ వచ్చిందని చెప్పొచ్చు..ఈ చిత్రం ప్రీమియర్స్ కి అక్కడ 50 వేల డాలర్లు వచ్చాయి, మొత్తం మీద మొదటి రోజుకి కలిపి లక్ష డాలర్లు వచ్చాయట..మీడియం రేంజ్ హీరో అయిన కళ్యాణ్ రామ్ కి ఇది మంచి ఓపెనింగ్ అనే చెప్పాలి, కానీ మన తెలుగు స్టేట్స్ లో మాత్రం వసూళ్లు ప్రారంభ ఆట నుండే లేవు..ముఖ్యంగా ఇలాంటి జానర్ సినిమాలకు నైజాం ప్రాంతం లో ఎక్కువ మంచి ఓపెనింగ్ వస్తుంది..కానీ అమిగోస్ కి అక్కడే లేదు..మొదటి రోజు మొత్తానికి కలిపి ఈ సినిమాకి కేవలం కోటి రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చిందట..అంటే షేర్ 60 లక్షల రూపాయిల రేంజ్ లో ఉంటుంది..ఇక ఆంధ్ర సైడ్ ఓపెనింగ్ కూడా అంతంత మాత్రమే.

ముఖ్యంగా నందమూరి హీరోలకు కంచుకోట అనే చెప్పుకునే సీడెడ్ ప్రాంతం లో ఈ సినిమాకి కేవలం 50 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది..షేర్ 30 లక్షల వరకు ఉండొచ్చు, ఉత్తరాంధ్ర , గుంటూరు, కృష్ణ , నెల్లూరు మరియు గోదావరి జిల్లాలు కలిపి మరో 70 లక్షల రూపాయిల గ్రాస్, మొత్తం మీద ఆంధ్ర ప్రాంతం లో కోటి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూలు చేసిందట, మొత్తం మీద మొదటి రోజు కి కలిపి ఈ చిత్రానికి రెండు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్, కోటి రూపాయలకు పైగా షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి, మొత్తం మీద ప్రపంచ వ్యాప్తం గా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ మరియు రెండు కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసిందట..బ్రేక్ ఈవెన్ నెంబర్ తక్కువ కాబట్టి వీకెండ్ స్టడీ కలెక్షన్స్ మైంటైన్ చేస్తే హిట్ అవ్వొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు.