
Ambedkar Jayanti 2023: కులం కూడు పెట్టదు. మతం మనుగడనీయదు. మానవత్వం ఎల్లకాలం నిలిచి ఉంటుంది. సమసమానత్వం గొడుగు లాగా నీడనిస్తుంది. ఇవీ బాబా సాహెబ్ అంబేద్కర్ పదేపదే ప్రవచించిన మాటలు. రాజ్యాంగ రచనలోనూ ఆయన ప్రముఖంగా పేర్కొన్న మాటలు. నేడు ఆయన విగ్రహాల ఏర్పాటులో తలమునకలైన నాయకులు.. ఆయన సూచించిన మాటలు పాటిస్తున్నారా? ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? విగ్రహ పూజను, వ్యక్తి ఆరాధనను వ్యతిరేకించిన అంబేద్కర్.. నేటి తరం రాజకీయ నాయకులకి ఇస్తున్న సందేశం ఏమిటి? ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మరొకసారి మననం చేసుకోవాల్సి ఉంటుంది.
అంబేద్కర్ రాజనీతిజ్ఞుడు
రాజకీయ నాయకులు అధికారం కోసం ఓట్ల రాజకీయం చేస్తారు.. రాజనీతిజ్ఞులు దేశానికి దిశా నిర్దేశం చేస్తారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగ రచన యజ్ఞానికి వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజకీయ నాయకుడు కాదు, రాజనీతిజ్ఞుడు కూడా కాదు.. ఆయన అంతకుమించి.. దర్శనికుడు, కులం, మతం, విద్య, రాజకీయాలు.. ఈ అంశమైనా అభిప్రాయాలు కచ్చితంగా చెప్పి.. సమాజంలో ఉన్న అసమానతలు గురించి, వాటిని దిద్దుకోవాలని సూచించి, దిద్దుకోకుంటే వచ్చే ప్రమాదాల గురించి ఏడున్నర దశాబ్దాల క్రితమే సమాజాన్ని హెచ్చరించిన ద్రష్ట. దేశ భవితవ్యం పై, కుల, మత, రాజకీయాల ప్రభావం గురించి ఆయన ఆనాడు వ్యక్తం చేసిన భయాలు అత్యధిక శాతం అనతికాలంలోనే నిజమయ్యాయి.
వ్యక్తి పూజ వద్దు
ఆత్మగౌరవం తాకట్టు పెట్టి ఈ వ్యక్తికి వ్యక్తిగత పూజ చేయాల్సిన అవసరం లేదు. ఏ మహిళ కూడా తన శీలాన్ని ఫణంగా పెట్టి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదు. భారత రాజకీయాల్లో భక్తి, వ్యక్తి పూజలకు కీలక పాత్ర. మరే దేశంలోనూ ఇలా ఉండదు. మతంలో భక్తి అనేది మోక్షానికి మార్గం కావచ్చు. కానీ రాజకీయాల్లో భక్తి లేదా వ్యక్తి పూజ అనేది పతనానికి అంతిమంగా నియంతృత్వానికి దారి తీస్తుంది. దేశానికి సేవ చేసిన మహనీయుల పట్ల కృతజ్ఞత చూపడం తప్పు కాదు, కానీ దానికి ఒక హద్దులు ఉన్నాయని అంబేద్కర్ ఆనాడే స్పష్టం చేశారు.
దేశం గొప్పదనే భావన ఉండాలి
కులం ఎప్పుడూ కూడు పెట్టదు. మతం ఎప్పుడూ మనుగడనీయదు. భారతీయుడు మతం కంటే దేశం గొప్ప అని భావించినప్పుడు.. దేశం అభివృద్ధి సాధిస్తుంది. కులాన్ని విడనాడినప్పుడు రాజ్యం మరింత వృద్ధిలోకి వస్తుంది. కానీ దేశం కంటే కులం, మతం పెచ్చరిల్లిపోతే దేశం మనదే ప్రమాదంలో పడుతుంది.
జాతిగా అభివృద్ధి చెందాలి
అమెరికా పౌరులు తమ దేశాన్ని ఐక్యదేశంగా కాకుండా, సంయుక్త రాష్ట్రాలుగా అభివర్ణించుకున్నారు. వారే తమను తాము ఒక జాతిగా పరిగణించినప్పుడు.. భారతీయులు తమను జాతిగా భావించడం ఎంత కష్టం? మనల్ని మనం జాతిగా భావించడం అంటే మాయలో పడినట్టే. వేల కులాలుగా చీలిపోయిన భారతీయులు ఒక జాతిగా ఎలా అవుతారు? సామాజికంగా, మానసికంగా మనం ఇంకా ఒక జాతి కాలిన విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. అప్పుడే ఒక జాతిగా ఆవిర్భవించాల్సిన అవసరాన్ని గ్రహిస్తాం.
సమానత్వం కచ్చితంగా కావాలి
భారతీయ సమాజంలో సమానత్వం లేదన్న వాస్తవాన్ని కచ్చితంగా ఒప్పుకోవాలి. సామాజికంగా చూస్తే భారత సమాజం వర్గీకృత అసమానత్వ పునాదులపై ఏర్పడి ఉంది. సమాజంలో కొందరు అంతులేని సిరిసంపదలతో తులతూగుతూ ఉంటే.. మరికొందరు హీనమైన పేదరికంలో మగ్గిపోతున్నారు.. ఇలాంటి సమాజంలో 1950 జనవరి 26 నుంచి మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆ రోజు నుంచి దేశంలో ప్రతి ఒక్కరికి రాజకీయంగా సమానత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకే ఓటు,ఓకే విలువ ఉంటాయి. కానీ సామాజిక, ఆర్థిక జీవనంలో మాత్రం అందరికీ ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరించడం మాత్రం కొనసాగుతుంది.

ఆ రాష్ట్రాలను విభజించాల్సిందే
ఒక రాష్ట్రం ఒక భాష అనే నియమని అమలుపరచడం ఎందుకు అవసరమవుతుంది అంటే సాంస్కృతి పరమైన, జాతిపరమైన వైశ్యమ్యాలకు అదొక్కటే పరిష్కారం గనుక. రెండు భాషా వర్గాల వారు కలిసి ఉన్నా అందులో సహజత్వం ఉండదు. జనాభా, అధికారాల విషయంలో రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాలు దేశానికి కచ్చితంగా ప్రమాదకరమవుతాయి. దీనికి ఖచ్చితమైన నివారణ రూపొందించడం అత్యవసరం. ఉత్తరాది ఆదిత్యాన్ని దక్షిణాది తట్టుకోలేదు. భారత రాజకీయాలపై ఉత్తరాది మోతాదుకు మించి తన ప్రాబల్యం కొనసాగిస్తే దానిపై దక్షిణాదికి ఉన్న అఇష్టత ద్వేషంగా మారవచ్చు. ఏ ఒక్క రాష్ట్రానికైనా కేంద్రంలో ఆధునిక ప్రాబ్లం ఉండేటట్లు అనిపిస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది.. కాబట్టి ఉత్తరాది రాష్ట్రానికి చెందిన బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలను ముక్కలుగా విడగొట్టడమే ఆ సమస్యకు ఏకైక పరిష్కార మార్గం అవుతుంది.