https://oktelugu.com/

వైరల్ : అల్లు అర్హ క్యూట్‌ స్మెల్‌ కి ఫ్యాన్స్ ఫిదా !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి అల్లు స్నేహ కూడా సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఎప్పుడు బిజీగా ఉంటారు. ముఖ్యంగా స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ తో పాటు బన్నీ అభిమానులను కూడా తెగ ఉత్సాహ పరుస్తూ ఉంటారు. అయాన్‌, అర్హలకు సంబంధించి అల్లు స్నేహ ఇప్పటివరకు షేర్‌ చేసిన వీడియోలు, ఫోటోలు బాగా వైరల్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ […]

Written By:
  • admin
  • , Updated On : July 4, 2021 / 05:07 PM IST
    Follow us on

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి అల్లు స్నేహ కూడా సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఎప్పుడు బిజీగా ఉంటారు. ముఖ్యంగా స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ తో పాటు బన్నీ అభిమానులను కూడా తెగ ఉత్సాహ పరుస్తూ ఉంటారు.

    అయాన్‌, అర్హలకు సంబంధించి అల్లు స్నేహ ఇప్పటివరకు షేర్‌ చేసిన వీడియోలు, ఫోటోలు బాగా వైరల్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా అర్హ ఫోటో షూట్‌ పిక్స్‌ షేర్ చేయడం, ఆ ఫోటోలు కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్హకు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది స్నేహ.

    ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్‌ అవుతోంది. ఆ మధ్య బన్నీ ఫ్యామిలీలో ఓ ఫంక్షన్‌ జరిగింది లేండి. ఆ ఫంక్షన్‌ లో అల్లు అర్హను రెడీ చేయిస్తూ తీసిన వీడియో ఇది. కాగా ఈ వీడియో ఇప్పుడు షేర్‌ చేయడంతో నెటిజన్లను ఈ వీడియో బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ వీడియోలో అర్హ పాప క్యూట్‌ స్మెల్‌ కి ఫ్యాన్స్ అయిపోతున్నారు.

    అందుకే ఈ వీడియోని బన్నీ ఫ్యాన్స్‌ భారీగా షేర్ అండ్ లైక్ చేస్తూ ట్రెండ్ లోకి తీసుకువెళ్తున్నారు. అన్నట్టు లిటిల్‌ ప్రిన్సెస్‌ అంటూ అర్హని పొగడ్తలతో ముంచేస్తున్నారు బన్నీ అభిమానులు. ఇక అల్లు స్నేహా కు 4 మిలియ‌న్‌ ప్లస్‌ ఫాలోయర్స్‌ ఉన్నారు. ఇన్‌స్టా ఫాలోయర్స్‌ లో ఇదొక స‌రికొత్త రికార్డు అనే చెప్పాలి.