Allu Arjun remanded for 14 days
Allu Arjun Arrested : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన మీడియా లో ఎంతటి సంచలనంగా మారిందో మన అందరికి తెలిసిందే. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో చూస్తున్న సమయం లో అల్లు అర్జున్ ని చూసేందుకు సంధ్య థియేటర్ కి వేల సంఖ్యలో అభిమానులు రావడం, ఈ సందర్భంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందడం తీవ్రమైన విషాదం ని నెలకొల్పింది. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ రేవతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయిల ఆర్ధికసాయం కూడా అందించాడు. ఆమె పిల్లలిద్దరి బాధ్యతలను చూసుకుంటానని చెప్పుకొచ్చాడు. కానీ రేవతి భర్త భాస్కర్ మాత్రం తగ్గలేదు. అల్లు అర్జున్ పై కేసు వెయ్యడం తో ఆయనపై FIR నమోదు అయ్యింది. ముందుగా థియేటర్ ఓనర్స్ ని అరెస్ట్ చేయగా, కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచారు.
కాసేపటి క్రితమే విచారణ చేపట్టిన నాంపల్లి హై కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల పాటు రిమాండ్ ని విధించింది. దీంతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు అల్లు అర్జున్ ని రిమాండ్ సెల్ లో విచారించనున్నారు. మరోపక్క చంచల్ గూడ జైలు ఆవరణలో భారీ సంఖ్యలో పోలీసులు చేరారు. చుట్టుపక్కన ఎలాంటి జనసమీకరణ జరగకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం కుటుంబ సభ్యులను కూడా అనుమతించలేదు. మెగాస్టార్ చిరంజీవి చిక్కడిపల్లి జైలుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు . దీంతో ఆయన తన సతీమణి సురేఖ తో కలిసి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానం లో కొద్దీ సేపటి క్రితమే విజయవాడ నుండి హైదరాబాద్ కి బయలుదేరాడు