
Allu Arjun- Pathan Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులంతా ఎంతలా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. 2021 వ సంవత్సరంలో విడుదలైన పుష్ప సినిమా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఎలా షేక్ చేసిందో మరచిపోలేము. ఆ సినిమా అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది.
ముఖ్యంగా మాస్ ప్రాంతాలలో ఆయనకీ షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి రీసెంట్ ఉదాహరణ నిన్న విడుదలైన ‘పుష్ప : ది రూల్’ టీజర్.తెలుగు లో కంటే కూడా ఈ టీజర్ కి హిందీ సెన్సషనల్ వ్యూస్ వచ్చాయి.యూట్యూబ్ లో ఈ టీజర్ కి 24 గంటలు గడవక ముందే 22 మిలియన్ వ్యూస్ మరియు 11 లక్షల లైక్స్ వచ్చాయి.
ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ టీజర్ కి ‘పుష్ప : ది రూల్’ కి వచ్చిన వ్యూస్ తో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పాలి.షారుఖ్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ సినిమా టీజర్ ని దాటి భారీ రీచ్ ని సంపాదించింది అంటే, పుష్ప సీక్వెల్ కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.పఠాన్ మూవీ టీజర్ కి 24 గంటల్లో 18 మిలియన్ వ్యూస్ మరియు 11 లక్షల లైక్స్ వచ్చాయి.

కానీ ‘పుష్ప: ది రూల్’ కి మాత్రం 18 గంటల్లోనే 22 మిలియన్ వ్యూస్ మరియు 11 లక్షల లైక్స్ వచ్చాయి.24 గంటలు గడిచిన తర్వాత ఈ టీజర్ కి 27 మిలియన్ వ్యూస్ వస్తాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.విడుదలైన తర్వాత బాలీవుడ్ లో పుష్ప గాడి రూల్ మొదలవుతుంది అనుకున్నారు కానీ, కేవలం టీజర్ తోనే పుష్ప గాడి రూల్ ప్రారంభం అయ్యిందని అంటూ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.