Allu Arjun Arrest: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కారణం ఏదైనా కూడా వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని వరుస సక్సెస్ లను సాధిస్తు ఉంటారు. ఇక ఒకరిని మించిన సక్సెస్ లను మరొకరు కొడుతూ టాప్ పొజిషన్ కి వెళ్తారు…ఒక హీరో సూపర్ హిట్ కొడితే మరొక హీరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే వివిధ తరహా పాత్రలను పోషిస్తూ వాళ్లకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవడానికి అనుక్షణం పరితపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించిన వారే కావడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీ అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉంటాయి. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమాలో వైవిద్య భరితమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించిన అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్న ఈ సినిమా తొందర్లోనే ఇండస్ట్రీ హిట్ గా కూడా కన్వర్ట్ కాబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ ని ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఇక దానికి కారణం ఏంటి అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి కొడుకు ఇద్దరు మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని ఆయన మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక దానికి సంబంధించిన విచారణను చేపట్టడానికి చిక్కడ పల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే అతన్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించినట్లుగా తెలుస్తుంది…
మరి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పుష్ప 2 సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడనే సంతోషం కంటే తన వల్ల రెండు ప్రాణాలు పోయాయనే బాధ ఎక్కువగా ఉంది అంటూ రీసెంట్ గా సక్సెస్ మీట్ లో ఆయన తన బాధను వెలిబుచ్చిన విషయం మనకు తెలిసిందే.