TDP Janasena Alliance: ఏపీలో పొత్తు రాజకీయం కొత్త మలుపు తిరుగుతోందా? వైసీపీని గెద్దె దించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న టీడీపీ, జనసేనలు వ్యూహం మార్చాయా? ఎవరికీ అంతుపట్టని రీతిలో ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నాయా? సడన్ గా అవి రూటు మార్చడానికి కారణం ఏమిటి? పొత్తుల సానుకూల వాతావరణం ఏర్పడిన తరుణంలో వాటి ఆలోచన ఎందుకు మారింది? ఇప్పుడిదే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారింది. రెండు పార్టీ శ్రేణుల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. కేడర్ ను అయోమయానికి గురిచేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్యన విశాఖ పర్యటన సమయంలో పవన్ ను ప్రభుత్వం అడ్డుకుంది. విశాఖ నుంచి బలవంతంగా సాగనంపింది. దీంతో చంద్రబాబు పవన్ వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఖాయమన్న సంకేతాలు ఇరు పార్టీ శ్రేణులకు వెళ్లాయి. అటు పవన్ విశాఖలో ప్రధాని మోదీని కలిసిన తరువాత కాస్తా విభిన్న ప్రకటనలు ఇచ్చినా.. తరువాత పొత్తుకు సానుకూలంగా మాల్లాడారు. అయితే ఇటీవల ఉన్నట్టుండి అటు చంద్రబాబు, ఇటు పవన్ సైలెంట్ అయ్యారు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. మారిన వ్యూహంలో భాగంగానే ఇద్దరూ సైలెంట్ అయ్యారన్న టాక్ అయితే నడుస్తోంది.

ప్రస్తుతం జగన్ సర్కారుపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉంది. విపక్షాలు బలం పుంజుకున్నట్టు సర్వే సంస్థలు సైతం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిస్తే ఏకపక్ష విజయం సాధ్యమన్న టాక్ నడుస్తోంది. అయితే మారిన పరిస్థితులు నేపథ్యంలో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీచేసినా ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంటాయని సర్వేలు వెల్లడిస్తున్నాయట. పైగా చంద్రబాబు ఒంటరిగా పోటీచేసి గెలవలేరు.. పవన్ 175 సీట్లలో పోటీచేసి గెలవగలరా? అని వైసీపీ నేతలు గేలి చేస్తుంటారు. వీటన్నింటీకి చెక్ చెప్పేందుకు విడివిడిగా పోటీచేయాలన్న నిర్ణయానికి అటు పవన్, ఇటు చంద్రబాబు డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
పొత్తులు కుదుర్చుకోవడం కూడా అంతా అషామాషి విషయం కాదు. టీడీపీ గ్రౌండ్ లెవల్ లో పాతుకుపోయిన పార్టీ, కేడర్ పరంగా, నాయకత్వం పరంగా బెటర్ పొజిషన్ లో ఉంది. జనసేన మంచి దూకుడు మీద ఉంది. కానీ గ్రౌండ్ లెవల్ లో టీడీపీతో పోల్చుకుంటే బలం తక్కువ. అటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. తమ సాయం కావాలంటే వీలైనన్ని ఎక్కువ సీట్లు అడిగేందుకు ప్రయత్నిస్తుంది. పైగా ఇప్పటివరకూ పొత్తులపై స్పష్టత ఇవ్వలేదు. అటు వైసీపీకి లోపయికారీ సహకారం అందిస్తోంది. బీజేపీని వదిలి టీడీపీతో కలిస్తే ఢిల్లీ పెద్దల మనసు చిన్నబోతుందని పవన్ భావిస్తున్నారు. అదేజరిగితే వారు వైసీపీకి బాహటంగా మద్దతిస్తారని అనుమానిస్తున్నారు. అందుకే విడివిడిగా పోటీచేసి పరస్పరం సహకరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అదే బెటరని నమ్ముతున్నారు. ఎన్నికల అనంతరం కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేద్దామని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

అయతే అటు టీడీపీ, ఇటు జనసేన కేడర్లు మాత్రం ఎట్టి పరిస్తితుల్లో పొత్త ఉండాల్సిందేనని తమ నాయకత్వాలకు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. ఒకే భావజాలంతో పనిచేస్తున్నారు. ఎన్నికల్లో కూడా కలిసి వెళ్తే మరింత స్ట్రాంగ్ గా పనిచేసేందుకు అవకాశముంటుందని భావిస్తున్నారు. కానీ నాయకత్వాలు మాత్రం ఇప్పుడు విడివిడిగా అనేసరికి వారిలో అయోమయం నెలకొంది. గత మూడున్నరేళ్లుగా గందరగోళం మధ్య గడుపుతున్నామని.. ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.