https://oktelugu.com/

PV Sindhu: ప్రభాస్ అంటే పిచ్చి.. కోచ్ గోపీచంద్ వల్లే అకాడమీ నుంచి బయటకు.. ఓపెన్ అయిన పీవీ సింధు

PV Sindhu: పీవీ సింధు.. భారత దేశం గర్వించే బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదిగింది. ఇప్పటికే ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన మన పసిడి బొమ్మ. ఎప్పుడూ ఆటల్లోనే మునిగితేలే ఈమెకు ఇతర వ్యాపకాలు కూడా ఉన్నాయి. పీవీ సింధు సినిమాలు చూస్తుంటుంది. పర్యటనలు చేస్తుంటుంది. ఆమెకు ఇష్టమైన హీరో కూడా ఉన్నాడు. ఇట్లాంటి చాలా విషయాలను తాజాగా ‘అలీతో సరదాగా’లో పంచుకుంది. గోల్డ్ మెడల్ తీసుకున్న ప్రతీ సారి కన్నీళ్లతో ఎమోషనల్ అవుతానని.. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 20, 2022 / 02:20 PM IST
    Follow us on

    PV Sindhu: పీవీ సింధు.. భారత దేశం గర్వించే బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదిగింది. ఇప్పటికే ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన మన పసిడి బొమ్మ. ఎప్పుడూ ఆటల్లోనే మునిగితేలే ఈమెకు ఇతర వ్యాపకాలు కూడా ఉన్నాయి. పీవీ సింధు సినిమాలు చూస్తుంటుంది. పర్యటనలు చేస్తుంటుంది. ఆమెకు ఇష్టమైన హీరో కూడా ఉన్నాడు. ఇట్లాంటి చాలా విషయాలను తాజాగా ‘అలీతో సరదాగా’లో పంచుకుంది.

    గోల్డ్ మెడల్ తీసుకున్న ప్రతీ సారి కన్నీళ్లతో ఎమోషనల్ అవుతానని.. జాతీయ జెండా పట్టగానే పట్టరాని ఆనందం వస్తుందని పీవీ సింధు చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని.. మేం మంచి ఫ్రెండ్ అంటూ తెలిపింది.

    టోర్నమెంట్లకు డాడీతో.. ఫంక్షన్లు, అవార్డులకు అమ్మతో వెళతానని.. ఇందుకు కారణాలు ఏవీ లేవని పీవీ సింధు తెలిపింది. ఇక ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం కూడా ఉందని సింధు తెలిపింది. నా బయోపిక్ తీస్తే అందులో తానే నటిస్తానని స్పష్టం చేసింది. దీంట్లో హీరోగా తాను నటిస్తానని కమెడియన్ అలీ సరదాగా అన్నాడు.

    లవ్ లెటర్స్ ఇంటికి వచ్చాయని నాన్న, అమ్మ అందరం కలిసి చదివేవాళ్లమని పీవీ సింధు తెలిపింది. ఇక ఒక 70 ఏళ్ల ముసాలయన అయితే పీవీ సింధు ప్రేమను అంగీకరించకపోతే కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంటానని బెదిరించాడని సింధు చెప్పుకొచ్చింది.

    తనకు నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని పీవీ సింధు ఆఫర్ ఇచ్చింది. దీంతో అబ్బాయిలు ఇక మీరు త్వరపడండి అంటూ అలీ అందరికీ ఆఫర్ ఇచ్చాడు.

    ఇక ఈ స్థాయిలో పీవీ సింధు ఉండడానికి ముఖ్య కారణమైన గోపీచంద్ అకాడమీ నుంచి ఎందుకు బయటకు వచ్చానో పీవీ సింధు చెప్పుకొచ్చింది.  గోపీచంద్ అకాడమీలో వారి పద్ధతి నచ్చలేదని.. తనకు వారికి పొంతన కుదరలేదని.. అందుకే బయటకు వచ్చానని పీవీ సింధు సంచలన విషయాలు పంచుకుంది. అయితే వాటిని కట్ చేయడంతో కోచ్ గోపీచంద్ పై సింధు ఏం కామెంట్స్ చేసిందన్నది రివీల్ కాలేదు. అది ఈ సోమవారం ఫుల్ ఎపిసోడ్ లోనే మనం చూడొచ్చు.