Alia Bhatt saluting Rajamouli’s feet: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు పెద్దలు. ఇప్పుడు బాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ గా కీర్తినందుకుంటున్న ఆలియాభట్ తెలుగులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సీతగా నటిస్తోంది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ఆలియా తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ హిందీ ప్రమోషన్ లో పాల్గొంది. అక్కడ రాజమౌళికి కాలు తగలడంతో ఆలియా స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్లు వివిధ భాషల్లో రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా అందరి అభిమానం.. అభినందనలు అందుకుంటున్నాయి. ముంబైలో జరిగిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో మూవీ యూనిట్ పాల్గొంది. హిందీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవ్ గణ్, ఆలియాభట్, రాజమౌళి, దానయ్య, పెన్ స్టూడియోస్ అధినేతలు పాల్గొని విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Also Read: ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్ లో ఎన్టీఆర్ దుమ్ముదులిపాడు
ఇక రాజమౌళి, ఆలియా భట్ పక్కపక్కనే వేదికపై కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఆలియా కూర్చునే క్రమంలో కాలు మీద కాలు వేసుకొని కూర్చునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో రాజమౌళికి ఆలియా భట్ కాళ్లు తగిలాయి. అలా తగిలాయని ఆలియా వదిలేదు. ఎలాంటి గర్వం లేకుండా రాజమౌళి కాళ్లకు దండం పెట్టబోయింది.
రాజమౌళి మాత్రం వద్దని అలా ఆపేశాడు. మొత్తానికి ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశంలోనే నంబర్ 1 హీరోయిన్ ఆలియా భట్ సంస్కారానికి సలాం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తు్నారు.
Also Read: రాజమౌళి స్థూలంగా కథను వివరించేశాడు !