Alia Bhatt: ఆలియా భట్.. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చాలా రోజులు ప్రేమాయణం నడిపి ఇటీవలే సడెన్ గా పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ పలు సినిమాల్లో బిజీగా నటిస్తున్న సమయంలోనే ఆకస్మికంగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. అంతే వేగంగా రణబీర్ తో సంసారం చేసి గర్భం దాల్చింది. పెళ్లయిన మూడు నెలలకే గర్భం దాల్చానని ఫొటో కూడా పంచుకుంది ఈ అమ్ముడు.
హీరోయిన్లు, సినీ ప్రముఖులు పెళ్లి అయ్యాక పిల్లలు వద్దంటూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. రాంచరణ్ సతీమణీ ఉపాసన అయితే పెళ్లి అయిన 10 నెలలు అయినా ఇంకా పిల్లలను కనలేదు. ఇలాంటి టైంలో ఆలియా భట్ ఏకంగా గర్భం దాల్చడం వైరల్ అయ్యింది. ఇంత సడెన్ గా పిల్లలకోసం ఎందుకు ప్రయత్నించిందన్న ప్రశ్న తాజాగా ఆలియాకు ఎదురైంది.
Also Read: Deepak Hooda: కోహ్లీకి ఎసరుపెడుతున్న దీపక్ హుడా.. ఇంగ్లండ్ లోనూ దుమ్మదులిపాడు.. రికార్డు బద్దలు
కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఆలియా భట్.. తన పెళ్లి, కాపురంపై హాట్ కామెంట్స్ చేసింది. ఫస్ట్ నైట్ పై ఈ షోలో ఆలియా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. కరణ్ జోహార్ అంటేనే వ్యక్తిగత జీవితాలు బయటపెట్టడంలో ఆరితేరిన వాడు.. అందుకే ఈ షోకు అంత క్రేజ్. తాజాగా ప్రారంభమైన ఈ కొత్త షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రీమియర్ ప్రసారం కాబోతోంది.
ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ హాజరయ్యారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు ఆలియా ఆసక్తికరంగా స్పందించింది. ఫస్ట్ నైట్ గురించి కరణ్ జోహర్ డైరెక్ట్ గా ఆలియాను అడిగేశారు. దానికి తడుముకోకుండా ఆలియా ఫస్ట్ నైట్ పై స్పందించింది. ‘ఫస్ట్ నైట్ అనేది ఏదీ ఉండదు. ఆ సమాయానికి చాలా అలసిపోయి ఉంటాం’ అని ఆలియా జవాబిచ్చింది. ఇంకా ఎన్నో ప్రశ్నలకు ఆలియా, రణబీర్ సింగ్ చలాకీగా జవాబులు చెప్పారు. తాజాగా ఆలియా ఫస్ట్ నైట్ గురించి చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇంత త్వరగా గర్భం దాల్చిన ఆలియా ఫస్ట్ నైట్ రోజు అలిసిపోయామని అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Also Read: BJP- Rajya Sabha: ఆ నలుగురికి రాజ్యసభ ఎంపికతో బీజేపీకి లాభం ఏంటి?