Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రెండోసారి తల్లయ్యారన్న వార్త పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. అలియా అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ కొన్ని ఆధారాలు చూపుతూ అలియా మళ్ళీ గర్భం దాల్చారంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. కాగా గత ఏడాది ఏప్రిల్ 14న అలియా భట్-రన్బీర్ కపూర్ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్ళైన ఏడు నెలలకే అలియా అమ్మాయికి జన్మనిచ్చారు. నవంబర్ లో అలియాకు డెలివరీ అయ్యింది. దీంతో పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చారన్న విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదే విషయం ప్రశ్నిస్తే తప్పేంటని ఆమె ఎదురు సమాధానం చెప్పారు. పెళ్లి కాకుండా ఇష్టమైన వ్యక్తి కారణంగా తల్లైతే వచ్చిన నష్టం ఏమీ లేదన్నట్లు మాట్లాడారు. అలియాకు మొదటి బిడ్డ పుట్టి కేవలం మూడు నెలలు మాత్రమే అవుతుంది. ఆమె సెకండ్ టైం ప్రెగ్నెన్సీ పొందారంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. మహిళలు గర్భం దాల్చినప్పుడు ధరించే బట్టలకు సంబంధించిన బ్రాండ్ ప్రమోషన్స్ లో అలియా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అలియా తల్లయ్యారనే వాదన ఊపందుకుంది.
ఈ వార్తల నేపథ్యంలో అలియా-రన్బీర్ మామూలు స్పీడు కాదు బాబోయ్ అని జనాలు వాపోతున్నారు. వయసులో తనకంటే చాలా పెద్దవాడైన రన్బీర్ కపూర్ ని అలియా ప్రేమించి వివాహం చేసుకుంది. వీరి కాంబినేషన్ లో బ్రహ్మాస్త్ర చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర సెట్స్ లోనే ఇద్దరి మధ్య అఫెక్షన్ మొదలైంది. ఒకరికొకరు తమ ప్రేమను వెల్లడించుకున్నారు. రిలేషన్ బయటకు వచ్చాక బహిర్గతంగానే ఈ జంట తిరిగారు. పెళ్లైన దంపతులు మాదిరి విహారాలు చేశారు. దాని ఫలితంగానే అలియా గర్భం దాల్చారు.

అలియా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న రన్బీర్ కపూర్ వెంటనే పెళ్ళికి ముహూర్తం పెట్టాడు. ఇక గత ఏడాది విడుదలైన బ్రహ్మాస్త్ర ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఇది రెండు పార్ట్స్ గా ప్లాన్ చేశారు. బ్రహ్మాస్త్ర చిత్ర నిర్మాతగా కరణ్ జోహార్ ఉన్నారు. బ్రహ్మాస్త్ర చిత్రం ఆయనకు భారీ నష్టాలు తెచ్చిందని, అందుకే పార్ట్ 2 చేసే ఆలోచన వదిలేశారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో అలియా రామ్ చరణ్ ప్రేయసి రోల్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ 2 ఉంటుందని రాజమౌళి ప్రకటించగా… అలియాకు మరోసారి ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి.