Nagababu- NTV: ఒకటి మాట్లాడితే ఇంకోటి ప్రసారం చేస్తారు. గిట్టని పార్టీల పై ఫేక్ ప్రచారం చేస్తారు. అధికార పార్టీ ఆశీస్సుల కోసం అర్రులు చాస్తారు. ప్రతిపక్షాల పై తప్పుడు ప్రచారమే లక్ష్యంగా విలువలకు వలువలు వదిలేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మీడియా సంస్థల పోకడ ఇది. జర్నలిజానికి తెగులు పట్టించిన కొన్ని తెలుగు మీడియా ఛానెళ్లు జనానికి రోత పుట్టిస్తున్నాయి.

“ పొత్తుల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. ఇప్పుడే మాట్లాడితే చాలా తొందరగా మాట్లాడినట్టు అవుతుంది. ప్రతిపక్షాల ఓటు చీలనివ్వను అంటే పవన్ కళ్యాణ్ మనసులో ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. అది నాకు కూడ తెలియదు. వెయిట్ చేస్తున్నాం. ఎవరితో పెట్టుకున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకుంటారు. పొత్తుల గురించి ఆయనే చెప్పాలి “ ఇవి ఎన్టీవీ ఫేస్ టూ ఫేస్ లో జనసేన నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలు.
“ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరితోనూ పొత్తు లేకుంటే జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. పొత్తులు నిర్ణయించడానికి ఇంకా చాలా సమయం ఉందని అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే తమ లక్ష్యమని అన్నారు నాగబాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పార్టీ పనిచేస్తుందని నాగబాబు చెప్పారు “ ఇవి ఎన్టీవీలో ప్రసారమైన వ్యాఖ్యలు.
జనసేన నేత నాగబాబు ఒకలా మాట్లాడితో ఎన్టీవీ ఇంకోలా దానికి అర్థం చెప్పింది. ఏపీలో పొత్తులు లేకుంటే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న మాటే నాగబాబు అనలేదు. కానీ ఎన్టీవీ మాత్రం లీడ్ తీసుకొని ఆ మాటను ప్రసారం చేసింది. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందరగా మట్లాడినట్టు అవుతుందని ఆయన చెప్పారు. కానీ ఎన్టీవీ మరోలా ప్రసారం చేసింది. దీని వెనుక ఎన్టీవీకి ఉన్న ప్రయోజనాలు ఏమితో అర్థం కాలేదు. ఉన్నది ఉన్నట్టు ప్రసారం చేయడానికి ఎందుకంత కష్టం. ఎవరి ప్రాపకం కోసం ఫేక్ ప్రచారం. ఎన్టీవీ వీడియో పై జనసేన నేత నాగబాబు స్పందించారు. ` షేమ్ ఆన్ యూ` అంటూ ఎన్టీవీ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ప్రతిపక్షాల పై దుష్ప్రచారం చేస్తూ అధికార పార్టీ ప్రాపకం కోసం పాకులాడటం జర్నలిజం కాదని మీడియా సంస్థలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా అంటే ప్రతిపక్షం. ప్రభుత్వ విధానాలు విశ్లేషించి, తప్పొప్పులను ఎత్తి చూపాల్సిన గురుతర బాధ్యత మీడియా పై ఉంది. అలాంటి మీడియా సంస్థలు కొన్ని ఫక్తు పెట్టుబడిదారి మనస్తత్వంతో అధికార పార్టీ ఆశీస్సుల కోసం ఎగబడుతున్నాయి.
నేను చెప్పింది ఏంటి..!
మీరు చెప్తోంది ఏంటి..?!Shame on You @NTVJustIn @NtvTeluguLive pic.twitter.com/yZlSYSBqVS
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 22, 2023