Bigg Boss 6 Telugu : ఈ సీజన్ లో టాప్ 2 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తాడు అనుకున్న శ్రీహాన్ మెల్లిగా తన తన గ్రాఫ్ ని ఈ వారం తగ్గించుకుంటూ వెళ్ళాడు..ఆట తీరు అద్భుతంగానే ఉంది..కానీ ప్రవర్తన లో చాలా తేడాలు వచ్చేస్తున్నాయి..ఈ వారం కీర్తి ని అతను నామినేట్ చేసిన విధానం ఎవ్వరికి నచ్చలేదు..ఒక కెప్టెన్ గా ఆయన కొన్ని విషయాల్లో డిజాస్టర్ గా నిలిచాడు.
ముఖ్యంగా గీతూ విషయం లో అతను చేసిన పొరపాటు ఈ వీకెండ్ నాగార్జున గారితో చివాట్లు పెట్టించుకునేలా చేసాడు..ఇక అసలు విషయానికి వస్తే గత వారం సంచాలక్ గా దారుణంగా ఫెయిలైన గీతూ కి శిక్ష విధిస్తూ నాగార్జున గారు ఇంట్లో వాష్ రూమ్స్ అన్నిటిని శుభ్రంగా కడగాలని చెప్పాడు..ఆమె ఆ శిక్షని తూచా తప్పకుండ ఫాలో అయ్యేవిధంగా చూసుకునే బాధ్యతని కెప్టెన్ శ్రీహాన్ కి ఇచ్చాడు..కానీ శ్రీహాన్ గీతూ విషయం లో ఇది గాలికి వదిలేసి చాలా పెద్ద తప్పు చేసాడు.
గీతూ వాష్ రూమ్ దగ్గర కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని తనకి ఇచ్చిన శిక్షని చెయ్యలేక ఆదిరెడ్డి తో చేయిస్తుంది..ఇది శ్రీహాన్ చూసి కూడా ఏమి అనకుండా జోక్ వేసి వెళ్తాడు..’బేబీ సిట్టర్ ఎమన్నా తెచ్చి ఇవ్వమంటావా..ఆయన చేస్తూ ఉంటాడు..నువ్వు చూస్తూ ఉండు..నన్ను ఎమన్నా నాగార్జున గారు అనాలి..నరికేస్తా నిన్ను’ అంటాడు.
ఈ వీడియో ని నాగార్జున గారు చూపించి..’ఏది ఇప్పుడు నరుకు గీతుని..నేను నిన్ను కెప్టెన్సీ కంటెండర్ గా లేకుండా నరుకుతున్న..బిగ్ బాస్ వచ్చే వారం శ్రీహాన్ కెప్టెన్సీ కంటెండర్ గా ఉండడం లేదు’ అని చెప్తాడు..ఇది వచ్చే వారం శ్రీహాన్ గేమ్ కి బాగా ఎఫెక్ట్ పడొచ్చు..ఎందుకంటే అతను టాస్కులో ఆడదానికి లేదు కాబట్టి..ఇక ప్రతి వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు టాప్ 2 స్థానం లో కొనసాగుతూ ఉండేవాడు శ్రీహాన్..ఈ వారం టాస్కులు ఆడదానికి లేదు కాబట్టి వోటింగ్ లైన్ లో అతని ర్యాంకింగ్ బాగా పడిపొయ్యే అవకాశం ఉంది.