Akhil – Naga Chaitanya : సైలెంట్ కిల్లర్.. అన్నయ్య నాగచైతన్యపై తమ్ముడు అఖిల్ సంచలన కామెంట్స్

Akhil – Naga Chaitanya : అక్కినేని అఖిల్ ప్రస్తుతం వైల్డ్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా చాలా వరకు పూర్తయింది. ఈ నేపథ్యంలో అఖిల్ సినిమా గురించి చాలా విషయాలు వెల్లడించాడు. సినిమా ఆద్యంతం అద్భుతంగా వచ్చింది. అందులోని తన పాత్ర గురించి అనుభవాలు పంచుకున్నాడు. ఓ మంచి సినిమా అందిస్తున్నామని దీమా వ్యక్తం చేస్తున్నాడు. నాగార్జున, నాగ చైతన్య గురించి అఖిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నాగార్జున నెమ్మదిగా […]

Written By: NARESH, Updated On : April 8, 2023 10:46 pm
Follow us on

Akhil – Naga Chaitanya : అక్కినేని అఖిల్ ప్రస్తుతం వైల్డ్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా చాలా వరకు పూర్తయింది. ఈ నేపథ్యంలో అఖిల్ సినిమా గురించి చాలా విషయాలు వెల్లడించాడు. సినిమా ఆద్యంతం అద్భుతంగా వచ్చింది. అందులోని తన పాత్ర గురించి అనుభవాలు పంచుకున్నాడు. ఓ మంచి సినిమా అందిస్తున్నామని దీమా వ్యక్తం చేస్తున్నాడు.

నాగార్జున, నాగ చైతన్య గురించి అఖిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నాగార్జున నెమ్మదిగా ఉంటారని చెప్పాడు. నాగచైతన్య సైలెంట్ కిల్లర్ అని అభిప్రాయ పడ్డాడు. సోదరుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అవి సంచలనంగా మారాయి. తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంటుంది. వారి ప్రోద్భలంతోనే సినిమాల్లో నటిస్తున్నాను. తనకు అమ్మానాన్నలతో పాటు అన్నతోడ్పాటు ఉంటుంది. సినిమాల విషయంలో తన అనుభవాలు వెల్లడించాడు.

వైల్డ్ ఏజెంట్ కథనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా నిర్మాణంలో దర్శకుడి ప్రతిభ ఎంతో ఉంది ఇందులో భాగంగా వైల్డ్ ఏజెంట్ సినిమా చాలా బాగా వచ్చిందన్నాడు. సురేందర్ రెడ్డి తన పాత్ర విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమా తనకు కచ్చితంగా మంచి పేరు తీసుకొస్తుంది. ఇన్నాళ్లు తీసిన సినిమాలు ఓ లెక్క. ఇప్పుడు తాను తీసే ఈ సినిమా మరో రేంజ్ లా ఉంటుంది.

సురేందర్ రెడ్డి మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు. చిరంజీవితో సైరా నరసింహా రెడ్డి తీసి శభాష్ అనిపించుకున్నాడు. రాంచరణ్ తో ధ్రువ తీసి ఔరా అనిపించుకున్నాడు. తన సినిమాల్లో మంచి కథనం ఉంటుంది. మంచి సెంటిమెంట్ తో ఎంతో వైవిధ్యంగా సినిమా తీయడం అయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో వైల్డ్ ఏజెంట్ కూడా అదే రేంజ్ లో అద్భుతంగా ఉంటుందని చెబుతున్నాడు.