https://oktelugu.com/

‘Agent’ Review : ‘ఏజెంట్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టబోతున్న అఖిల్

‘Agent’ Censored Review : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ ఈ నెల 28 ఆ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను మరియు అభిమానులను ఆకట్టుకుంది.అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి అయ్యాయి.సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ ని జారీ చేసారు. చిన్న చిన్న మైనర్ కట్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2023 / 03:38 PM IST
    Follow us on

    ‘Agent’ Censored Review : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ ఈ నెల 28 ఆ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను మరియు అభిమానులను ఆకట్టుకుంది.అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి అయ్యాయి.సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ ని జారీ చేసారు.

    చిన్న చిన్న మైనర్ కట్స్ తో ఈ సర్టిఫికేట్ ని ఇచ్చినట్టు మూవీ టీం చెప్పుకొచ్చింది.ఇక ఈ సినిమాకి సెన్సార్ సభ్యుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సమ్మర్ కి స్టార్ హీరోల సినిమాలు లేదని ట్రేడ్ దిగులు పడుతుంది కదా,కానీ ట్రేడ్ ధైర్యం గా ఉండొచ్చు,ఎందుకంటే ఈ సినిమా ద్వారా అక్కినేని అఖిల్ అనే సరికొత్త స్టార్ టాలీవుడ్ కి దక్కనున్నాడు అంటూ మూవీ టీం ని పొగడ్తలతో ముంచి ఎత్తేసింది.

    ఇలాంటి యాక్షన్ ఎంటర్టైనర్ ని టాలీవుడ్ లో చూసి చాలా కాలం అయ్యిందని, కచ్చితంగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని సెన్సార్ సభ్యులు ఈ సందర్భంగా అన్నారట.వాళ్ళు చెప్పిన ఈ మాటలు అక్కినేని అభిమానులకు పూనకాలు రప్పిస్తున్నాయి.ఇన్ని రోజులు అఖిల్ నుండి ఎలాంటి సినిమా రావాలని కోరుకున్నామో,అలాంటి సినిమా వస్తుందని,ఈ చిత్రం తో టాలీవుడ్ లో రికార్డ్స్ లెక్కలన్నీ మా అఖిల్ బాబు తెలుస్తాడని సోషల్ మీడియా లో అక్కినేని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.

    మరి వారి అంచనాలను అఖిల్ అందుకుంటాడో లేదో చూడాలి.మరో పక్క ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్ని ఘనంగా చెయ్యడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది.ఈ ఈవెంట్ కి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథి గా హాజరు కాబోతున్నట్టు సమాచారం.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చెయ్యనున్నారు.