
Akhil Akkineni: హీరో అఖిల్ ఏజెంట్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ ఛాలెంజింగ్ ప్రశ్న ఎదురైంది. నాగ చైతన్య మీద వస్తున్న పుకార్ల గురించి అఖిల్ ని అడగ్గా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. కొన్నాళ్లుగా నాగ చైతన్య మీద ఓ పుకారు ఉంది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన ఎఫైర్ నడుపుతున్నారని గట్టిగా వినిపిస్తోంది. మొదట్లో ఈ ప్రచారాన్ని చైతన్య టీం ఖండించారు. అలాగే శోభిత ధూళిపాళ్ల సైతం అంతా ట్రాష్ అంటూ కొట్టిపారేసింది.
అయితే వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడం సంచలనమైంది. లండన్ కి నాగ చైతన్య-శోభిత కలిసి వెళ్లారని ఆధారాలు లభించాయి. అనుకోకుండా వీరిద్దరూ ఓ ఫోటోలో క్యాప్చర్ అయ్యారు. అది కాస్తా లీకై పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దీంతో శోభితతో నాగ చైతన్య ఎఫైర్ వార్తల్లో నిజముందని టాలీవుడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. నాగ చైతన్య మాత్రం ఈ ఎఫైర్ రూమర్స్ మీద పెదవి విప్పలేదు.
కాగా అన్నయ్య నాగ చైతన్య ఎఫైర్ గురించి మీడియా ప్రతినిధులు అఖిల్ ని అడిగారు. ఏజెంట్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అఖిల్ కి ఈ ప్రశ్న ఎదురైంది. మీ అన్నయ్య నాగ చైతన్య ఒక హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నారని ప్రచారం అవుతుంది. వారి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి మీ పరిస్థితి ఏంటి? అని అడగ్గా…. నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండేళ్లుగా జుట్టు, శరీరం మైంటైన్ చేయడమే సరిపోతుంది. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల మీదే, అని చెప్పుకొచ్చారు.

కాగా అఖిల్ కి గతంలో ఎంగేజ్మెంట్ జరిగింది. కారణం తెలియదు కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ అఖిల్ పెళ్లి దిశగా అడుగులు వేయలేదు. ఇక ఏజెంట్ చిత్రం ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ చిత్రంలో అఖిల్ స్పై రోల్ చేశారు. సాక్షి వైద్య హీరోయిన్. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక రోల్ చేశారు.