Akhanda Hindi Collections: ఈమధ్య కాలంలో మన టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో కూడా బాగా క్లిక్ అవుతున్నాయి..సక్సెస్ అవుతున్నాయి కదా అని ప్రతీసారి వర్కౌట్ అవుతుందని చెప్పలేం..టైమింగ్ మరియు ప్రొమోషన్స్ కూడా కలిసి రావాలి..అవేమి లేకపోయినా అదృష్టం బాగుంటే కార్తికేయ 2 వంటి చిత్రాలు క్లిక్ అవుతాయి..అలా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన ‘అఖండ’ చిత్రాన్ని హిందీ లో డబ్ చేసి విడుదల చేసారు.

తెలుగులో లాగానే హిందీలో కూడా సక్సెస్ అవుతుందని అనుకున్నారు.. కానీ ఫలితం తలక్రిందులు అయ్యింది.. తెలుగు లో వీర సింహా రెడ్డి విడుదలైన వారం రోజులకు హిందీలో ‘అఖండ’ విడుదల చేసారు.. #RRR వంటి చిత్రాన్ని హిందీ లో డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్ మూవీస్ ఈ సినిమాని కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేసింది.

ప్రొమోషన్స్ కూడా వాళ్లకి ఉన్న పరిధి మేర బాగానే చేసారు..కానీ ఈ సినిమా అక్కడ డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకుంది..ఏదో కోటి రెండు కోట్ల రూపాయిలు గ్రాస్ అయిన వస్తుందని అనుకున్నారు.. కానీ ఈ సినిమాకి అక్కడ మొత్తం మీద బుక్కైన టిక్కెట్లు కేవలం ఒక్కటే అంటే..అంటే అక్షరాలా 115 రూపాయిలు మాత్రమే.. డబ్బింగ్ కోసం అయిన ఖర్చులైన ఈ చిత్రం రాబడుతుందని అనుకుంటే ఇలాంటి ఫలితం చూసి అక్కడి ట్రేడ్ పండితులకు సైతం మైండ్ బ్లాక్ అయ్యినంత పనైంది.
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీ మేనియాలో ఉండడం వల్లే ‘అఖండ’ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదని.. దానికి తోడు లేట్ రిలీజ్ కూడా ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడానికి కారణమని అంటున్నారు విశ్లేషకులు.. ఏది ఏమైనా హిందీ ‘అఖండ’ కలెక్షన్స్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్స్ మామూలు రేంజ్ లో లేవనే చెప్పాలి.