ACs Air Pollution: సాధారణంగా మనం వాతావరణ కాలుష్యం అనగానే రోడ్డుపై నడిచే వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మన దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం అత్యధికంగా ఉండడంతో ఇక్కడ కార్లను బ్యాన్ కూడా చేశారు. అయితే లేటెస్ట్ గా కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం కారు కంటే ఏసీనే ప్రమాదమని అంటున్నారు. ఏసీ నుంచి వెలువడే వాయువులు వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయని.. ఇవి కారు కంటే ప్రమాదం అని ఐఫారెస్ట్ అనే జాతీయ సంస్థ సర్వే ద్వారా తెలిపింది. మరి కారు కంటే ఏసీ ఎలా ప్రమాదమో ఆ వివరాల్లోకి వెళ్దాం..
ఐఫారెస్ట్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2024 సంవత్సరంలో ఏసీలు 156 మిలియన్ టన్నుల కార్బన్డయాక్సైడ్ ను రిలీజ్ చేశాయి. ఇందులో 52 టన్నులు ఏసీలో చల్లబరిచే ఎయిర్ లీక్ అవ్వడమే. ఏసీలోని రిఫ్రిజి రెంట్ బయటకు వచ్చినప్పుడు అది గ్రీన్హౌస్ వాయువులను వాతావరణం లో కల్పిస్తుంది. ఈ వాయువులు రోడ్డుపై వెళ్లేటప్పుడు కారు ఎంతవరకు రిలీజ్ చేస్తుందో.. అంతే సమానంగా ఉంటుందని ఐఫారెస్ట్ తెలిపింది. అయితే ఏసీలు ప్రతి ఐదేళ్లకి ఒకసారి రిపేర్ చేసుకోవాలని.. అలా చేసుకోకపోతే ఈ వాయువులు మరింత కాలుష్యాన్ని కలగజేసే అవకాశం ఉందని అంటున్నారు. భారతదేశంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి 40% ఏసీలను రిపీల్ చేస్తున్నారు. వీటిపై ఒక్క 2024 సంవత్సరంలోనే 7వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఏసీలు పెరిగే కొద్దీ వాతావరణ కాలుష్యం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలా 2030 కల్లా భారతదేశంలో గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో కలిసిపోతాయని.. అంటే అప్పటి వరకు 329 మిలియన్ టన్నుల కార్బన్డయాక్సైడ్ గాలిలో కలిసిపోయే అవకాశం ఉందని ఐఫారెస్ట్ పేర్కొంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లోని ఏసీల వినియోగం ఎక్కువగా ఉంది. ముందు ముందు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు కేవలం కార్యాలయాలు.. కొందరి ఇళ్లల్లో మాత్రమే ఏసీలు కనిపించేవి.. కానీ ఇప్పుడు చాలామంది ఏసీలను ఏర్పాటు చేసుకుంటున్నారని అనుకుంటున్నారు. ఏసీల వల్ల చల్లదనం వస్తుందని అనుకుంటున్నారని.. కానీ వీటివల్ల అనేక వాయువులు వెలువడే అవకాశం ఉందని తెలుపుతోంది. అయితే నాణ్యమైన ఏసీలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకోవడం వల్ల గ్రీన్ హౌస్ వాయువుల ఉదృతి తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు తెలుపుతున్నారు.
వేసవికాలంలో నేటితరం ఏసీలో ఉండాలని కోరుకుంటుంది. అందుకే చాలామంది ఫ్యాన్లు, కూలర్ల స్థానంలో ఏసీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఆరోగ్య దృష్ట్యా కూడా పరిశీలించి.. వీటిని ఏర్పాటు చేసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.