Agra Principal: ఇటీవల టీచర్లు కొట్టుకోవడం కామన్ అయింది. వ్యక్తిగత కక్షలు, ఇగో, ఇతర కారణాలతో మహిళా ఉపాధ్యాయులు కొట్టుకుంటున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో హెడ్‌మాస్టర్ టీచర్ బట్టలు చిరిగిపోయేలా కొట్టుకున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనే మరో ఘటన జరిగింది. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపాల్ టీచర్‌ను కొట్టింది.
తరచూ ఆలస్యంగా వస్తుందని..
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నపూర్ జిల్లా ఆగ్రా సీగానా గ్రామంలోని ప్రీ సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి తరచూ పాఠశాలకు ఆలస్యంగా వస్తోంది. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ ఆమెను మందలించింది. ఈ విషయంలో ఇద్దరి మద్య వాదనలు జరిగాయి. సహనం కోల్పయిన ప్రిన్సిపాల్ టీచర్‌పై ఒక్కసారిగా దాడి చేసింది. అంతటితో ఆగకుండా దుస్తులు చింపేందుకు యత్నించారు. మొదట వారిని వారించడానికి ప్రయత్నించిన ప్రిన్సిపాల్ ‘డ్రైవర్ సైతం టీచర్‌తో వాగ్వాదానికి దిగాడు.
వీడియో వైరల్..
ఈ ఘటనను పాఠశాలలోని మరో టీచరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది కాస్త వైరల్ అవుతోంది. అందులో ఇతర టీచర్లు కూడా ప్రిన్సిపాల్ అభస్యంగా ప్రవర్తిస్తున్నారని, ఆమె స్థాయికి తగ్గట్టు ప్రవరితంచడం లేదని ఆరోపించారు. ఈ ఘటన అనంతరం ప్రిన్సిపాల్ సదరు టీచర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఫేషియల్ చేయించుకున్న హెచ్‌ఎం..
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్కూల్‌లో హెచ్‌ఎం విద్యార్థితో ఫేషియల్ చేయించుకుంటుండగా ఓ ఉపాధ్యాయురాలు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కూడా వైరల్ అయింది. దీంతో ఓ టీచర్‌ను ప్రిన్సిపాల్ తీవ్రంగా కొట్టింది. తాజా స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని టీచర్‌పై ప్రిన్సిపాల్ దాడిచేసింది.
A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She’s a PRINCIPAL @agrapolice pic.twitter.com/db8sKvnNvs
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024