Illegal Affair : మూడుముళ్ల బంధంలో మూడో వ్యక్తి: పెళ్లయినా మరో శారీరక బంధం

Illegal Affair : పెళ్లంటే ఒక ప్రమాణం. భార్యాభర్తలంటే కలకాలం కలిసి సాగించే ప్రయాణం. పిల్లలు వారి దాంపత్యానికి బహుమానం.. పెద్దలు.. వారికి దిశా నిర్దేశం చేసే ఆదేశం.. ఇదే కదా కుటుంబం. కానీ ఇంతటి కుటుంబానికి ప్రధాన ఇరుసు భార్యాభర్తలే. వీరిలో ఏ ఒక్కరూ గాడి తప్పినా మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కుటుంబమే వీధినపడుతుంది.. దీనంతటికీ కారణం పచ్చని సంసారంలో మూడో వ్యక్తి ప్రవేశించడమే.. కానీ ఇప్పుడు యాదృచ్ఛికంగా దానిని మన సమాజం ఆమోదించే స్థాయికి […]

Written By: Bhaskar, Updated On : April 9, 2023 12:23 pm
Follow us on

Illegal Affair : పెళ్లంటే ఒక ప్రమాణం. భార్యాభర్తలంటే కలకాలం కలిసి సాగించే ప్రయాణం. పిల్లలు వారి దాంపత్యానికి బహుమానం.. పెద్దలు.. వారికి దిశా నిర్దేశం చేసే ఆదేశం.. ఇదే కదా కుటుంబం. కానీ ఇంతటి కుటుంబానికి ప్రధాన ఇరుసు భార్యాభర్తలే. వీరిలో ఏ ఒక్కరూ గాడి తప్పినా మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కుటుంబమే వీధినపడుతుంది.. దీనంతటికీ కారణం పచ్చని సంసారంలో మూడో వ్యక్తి ప్రవేశించడమే.. కానీ ఇప్పుడు యాదృచ్ఛికంగా దానిని మన సమాజం ఆమోదించే స్థాయికి వచ్చింది.

ఒక మనిషి ఇంకొక మనసుతో కలిసి శారీరకంగా, మానసికంగా సాగించే ప్రయాణాన్ని దాంపత్యం అంటారు. ఈ దాంపత్యం ఒక్కో దేశంలో ఒక్క విధంగా ఉంటుంది. వెస్ట్రన్ దేశాల్లో అయితే కలిసి ఉన్నంతవరకే.. తర్వాత ఏమాత్రం భేదాభిప్రాయాలు వచ్చినా ఎవరి దారి వారు చూసుకుంటారు. దీని వల్ల అక్కడ కుటుంబ వ్యవస్థలు అంత బలంగా ఉండదు. అదే మనదేశంలోకి వస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఇవాల్టికి కూడా మన కుటుంబ వ్యవస్థలు ఎంతో కొంత బలంగా ఉన్నాయి అంటే దానికి కారణం మనం విధించుకున్న నియమ నిబంధనలే. కానీ విచిత్రంగా మన కుటుంబ వ్యవస్థలోకి కూడా “ఇతర సంబంధాలు” దర్జాగా ప్రవేశిస్తున్నాయి. దాదాపు మెజారిటీ కుటుంబాలు వీటిని ఆమోదిస్తున్నాయి.

వెనుకటి రోజుల్లో ఒక భర్తకు ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు భార్యలు ఉండేవారు. దీనికి అనేక కారణాలు ఉండేవి. మొదటి భార్యకు సంతానం లేదనో లేక ఆడపిల్లలే కలుతున్నారు కాబట్టి మగసంతానం కావాలనో.. ఇలా మగాళ్లకు అప్పట్లో ఒక చట్టబద్ధమైన హక్కు ఉండేది. దీనిని కుటుంబాలు కూడా ఆమోదించేవి. అయితే కాలక్రమేణా ఈ సంస్కృతి మరుగున పడింది. తెరపైకి ఉంపుడికత్తే వ్యవహారం వచ్చింది.. ఇది చాటుమాటుగా జరిగే వ్యవహారం కాబట్టి ఎవరికీ తెలియకుండానే ఉండేది. ఒకవేళ ఎవరికైనా తెలిసినా తర్వాత పంచాయతీలు గట్రా జరిగేవి. ఇక ఇప్పటికీ మెజారిటీ భార్యలు భర్తలకు అలాంటి వ్యవహారం ఉంటే మొదట్లో గొడవ పెడుతున్నారు. తర్వాత సర్దుకుంటున్నారు.. ఇక ఇటీవల కాలం నుంచి భార్యల వ్యవహార శైలిలో కూడా పూర్తిగా మార్పులు వస్తున్నాయి. వారు కూడా ఎక్స్ ట్రా మ్యారిటల్ డేటింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు.. ఇవి కుటుంబాల్లో గొడవలకు దారితీస్తున్నప్పటికీ ఆడవాళ్లు వారి శైలి మార్చుకోవడం లేదు.. ఇటీవల ఖమ్మం జిల్లాలో చింతకాని మండలానికి చెందిన 48 ఏళ్ల మహిళ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది.. చివరకు ఆమె ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తోంది. ఇలాంటి ఘటనలు సమాజంలో పెరిగిపోతున్న పెడ పోకడలను కళ్ళకు కడుతున్నాయి.

ఇక ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించి నగరం గ్రామం అని తేడా లేకుండా అన్నిచోట్ల ఒకే విధంగా పరిస్థితులు ఉన్నాయి. గ్రామాల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. అదే నగరాల్లో అయితే రకరకాల సౌలభ్యాలు ఉండడం, అపరిమితమైన స్వేచ్ఛ ఉండడంతో సంబంధాలు దర్జాగా సాగిపోతున్నాయి. అయితే ఇట్లాంటి వ్యవహారాలలో బంధం కంటే శృంగారానికే ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 44 శాతం మంది అయితే ఒకేసారి జీవిత భాగస్వామితో సహా మరొకరితో ప్రేమలో ఉంటే సంతోషం కలుగుతుందని చెప్పారు. 55% మంది పెళ్లి తర్వాత మరొకరితో శృంగారం పట్ల ఆసక్తి కనబరిచారు. 35 శాతం మంది ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నప్పటికీ మరొకరితో శృంగారంలో పాల్గొనడం పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పారు. 33 శాతం మంది అయితే తమ జీవిత భాగస్వామి నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి బంధాల పట్ల ఆసక్తి పెంచుకోవాల్సి వస్తుందని చెప్పారు. 23 శాతం మంది తమ జీవిత భాగస్వామి మోసం చేస్తున్నాడు కాబట్టే ప్రతీకారంగా మరో సంబంధం కోసం చూపిస్తున్నారు. ఈ సర్వే కేవలం 1500 మంది నమునాలతో చేసింది మాత్రమే.. ఇంకా ఎక్కువ మందితో సర్వే చేస్తే ఫలితాలు మరో విధంగా ఉండవచ్చు.