HIT 2 OTT: వరుస హిట్స్ తో ముందుకి దూసుకుపోతున్న అడవి శేష్ ఖాతాలో మరో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘హిట్ 2’..శైలేష్ కొలను దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడం తో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి..ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 15 కోట్ల రూపాయిలు అవ్వడం తో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ చిత్రం.

కానీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ ఫుల్ రన్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు..నాల్గవ రోజు నుండి కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతూ వచ్చాయి..ఇక ఆపై కొత్త సినిమాలు కూడా విడుదల అవ్వడం తో ఈ మూవీ కి తొందరగానే క్లోసింగ్ పడింది..ఫుల్ రన్ లో అన్ని ప్రాంతాలకు కలిపి ఈ చిత్రం 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..అంటే బయ్యర్స్ కి 7 కోట్ల రూపాయిలు లాభం వచ్చింది అన్నమాట.
మూవీ సూపర్ హిట్ అయితే అయ్యింది కానీ, అడవి శేష్ గత చిత్రం మేజర్ లాంటి భారీ హిట్ మాత్రం కాదు..ఈ ఏడాది లో విడుదలైన మేజర్ చిత్రానికి 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..కేవలం తెలుగు లో మాత్రమే కాదు..హిందీ లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది..అలాంటి బ్లాక్ బ్యూటర్ తో పోలిస్తే తక్కువే కానీ,అడవి శేష్ కెరీర్ కి బాగా ప్లస్ అయిన సినిమా అని మాత్రం చెప్పొచ్చు.

కానీ ఎప్పుడూ థ్రిల్లర్ మూవీస్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు యాక్షన్ ఎంటెర్టైనెర్స్ , మాస్ మూవీస్ కూడా చేస్తే బాగుంటుందని..అడవి శేష్ బాగా రొటీన్ అయిపోతున్నాడు అని కూడా ఈ చిత్రానికి కామెంట్స్ వచ్చాయి..ఇక ఈ సినిమా OTT రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఒక శుభవార్త..ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు భారీ మొత్తం లో కొనుగోలు చేసారు..జనవరి 7 వ తారీఖు నుండి స్ట్రీమింగ్ కానుంది.