https://oktelugu.com/

HIT 2 Movie Review: హిట్ 2 మూవీ రివ్యూ

HIT 2 Movie Review: అడివి శేష్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2. డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. హిట్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శైలేష్ కొలను నుండి వస్తున్న మూవీ కావడంతో పాజిటివ్ బజ్ ఏర్పడింది. అడివి శేష్ హీరో కావడంతో అనుకూలతలు ఏర్పడ్డాయి. హిట్ 2 ట్రైలర్ అంచనాలు పెంచేయగా… ఎంత వరకు ఆ అంచనాలు అందుకుందో చూద్దాం తారాగణం : అడివి శేష్, […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2022 / 10:05 AM IST
    Follow us on

    HIT 2 Movie Review: అడివి శేష్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2. డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. హిట్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శైలేష్ కొలను నుండి వస్తున్న మూవీ కావడంతో పాజిటివ్ బజ్ ఏర్పడింది. అడివి శేష్ హీరో కావడంతో అనుకూలతలు ఏర్పడ్డాయి. హిట్ 2 ట్రైలర్ అంచనాలు పెంచేయగా… ఎంత వరకు ఆ అంచనాలు అందుకుందో చూద్దాం

    adivi sesh

    తారాగణం : అడివి శేష్, మీనాక్షి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్
    దర్శకత్వం డా. శైలేష్ కొలను
    నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
    సినిమాటోగ్రఫీ : ఎస్.మణికందన్
    ఎడిటర్: గ్యారీ Bh
    సంగీతం: ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి

    కథ:

    వైజాగ్ లో సంజన అనే అమ్మాయి మర్డర్ జరుగుతుంది. ఆమెను ఎవరో దారుణంగా హింసించి చంపేస్తారు. రాజకీయంగా దుమారం రేపుతున్న ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి కృష్ణదేవ్(అడివి శేష్) అలియాస్ కేడి రంగంలోకి దిగుతాడు. ఇలాంటి కేసులు చాలా చూశా కొన్ని గంటల్లో హంతకుడిని పట్టేస్తా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న కేడీకి కిల్లర్ సవాల్ గా మారతాడు. అతడి మూమెంట్స్, ప్లాన్స్ అర్థం కాక తల పట్టుకుంటాడు. మర్డర్ కి గురైంది సంజన మాత్రమే కాదు ఆ బాడీ కొందరు అమ్మాయిల శరీర భాగాలతో కూడి ఉందని తెలిసి కేడీ మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఈ సైకో సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు? అతడి మోటివ్ ఏమిటీ? కేడి ఈ కేసు ఎలా ఛేదించాడు? అనేది హిట్ 2 కథ…

    adivi sesh

    విశ్లేషణ:

    క్రైమ్ థ్రిల్లర్స్ కథలన్నీ ఒకలానే ఉంటాయి. మర్డర్ చేసింది ఎవరు? ఎందుకు చంపుతున్నాడు? అనే కోణంలో దర్శకుడు కథ నడపాల్సి ఉంది. తెలుగులో అంత్యంత పాప్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్ గా ఉన్న అవేకళ్ళు, అన్వేషణ నుండి ఇదే ఫార్ములా. హాలీవుడ్ నుండి అరువు తెచ్చుకున్న ఈ జోనర్ పలు సందర్భాల్లో మంచి ఫలితాలు ఇచ్చింది. హంతకుడు ఎవరో తెలియకుండా, ప్రేక్షకులను తికమక చేస్తూ, చీటింగ్ స్క్రీన్ ప్లేతో అలరించి క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ ఇస్తే మూవీ సక్సెస్ అయినట్లే.

    ఆ కోణంలో హిట్ 2 డైరెక్టర్ శైలేష్ కొలను సక్సెస్ అయినట్లే అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఆయన సెకండ్ హాఫ్ లో కథ చెప్పడానికి కావలసిన సెటప్ చేసుకున్నాడు. దీంతో ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్లుగా సాగుతుంది. హంతకుడు ఎవరు అనే సస్పెన్సు మాత్రం కొనసాగుతోంది. అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. సమయానుసారంగా వచ్చే ట్విస్ట్స్, ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్స్ ఆకట్టుకుంటాయి. హిట్ 3 హీరో ఎవరో పరిచయం చేయడం బాగుంది.

    adivi sesh

    కేడి రోల్ లో అడివి శేష్ అదరగొట్టారు. ఆయన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉన్నాయి. రోల్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయిన అడివి శేష్ యాక్టింగ్ చెప్పుకోవాల్సిన అంశం. హీరోయిన్ పాత్రకు కథ రీత్యా పెద్దగా పరిధి లేదు. మీనాక్షి చౌదరి పర్లేదు అనిపించారు. సాంకేతికంగా చూస్తే… బీజీఎం అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కి పాస్ మార్క్స్ వేయవచ్చు. హిట్ 2 చిత్రానికి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు.

    ప్లస్ పాయింట్స్:

    అడివి శేష్ యాక్టింగ్
    డైరెక్షన్
    స్క్రీన్ ప్లే
    క్లైమాక్స్

    మైనస్ పాయింట్స్:

    ఫస్ట్ హాఫ్
    బీజీఎం

    సినిమా చూడాలా? వద్దా?:

    థ్రిల్లర్ లవర్స్ కి హిట్ 2 విందు భోజనమే అని చెప్పొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చూసేవారికి నచ్చకపోవచ్చు. స్లోగా మొదలయ్యే హిట్ సెకండ్ హాఫ్ లో పుంజుకొని క్లైమాక్స్ లో మంచి హై ఇస్తుంది. ఈ వారానికి చూడదగ్గ చిత్రమే

    రేటింగ్: 3/5



    Tags