Krishna Brother Adiseshagiri Rao: సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పటికి జీర్ణించుకోలేకపోతోంది..సినీ ఇండస్ట్రీ గోల్డెన్ పీరియడ్ లో కొనసాగుతున్న సమయం లో ఇండస్ట్రీ ని సాంకేతిక విలువల పరంగా మరియు కమర్షియల్ పరంగా వేరే స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు ఆయన..ఆయన తీసుకున్న ఎన్నో డేరింగ్ నిర్ణయాలు ఇండస్ట్రీ లో పెనుమార్పులు తీసుకొచ్చింది..కృష్ణ గారి లెక్క నేటి తరం హీరోలు కూడా రిస్క్ చెయ్యలేకున్నారు.

అందుకే ఎంతమంది హీరోలు వచ్చినా..కృష్ణ గారిని మ్యాచ్ చేసేవాడు ఇప్పటి వరుకు పుట్టలేదు అని అంటుంటారు..అయితే కృష్ణ కి చిన్నప్పటి నుండి చివరి రోజులు వరుకు కుడి భుజం లాగ ఉంటూ వచ్చాడు ఆయన తమ్ముడు ఆది శేషగిరి రావు..కృష్ణ షూటింగ్స్ లో బిజీ గా ఉన్నప్పుడు పిల్లల ఆలనా పాలన చూసుకోవడం దగ్గరనుండి..పద్మాలయ స్టూడియోస్ ని మ్యానేజ్ చెయ్యడం వరుకు అన్నీ ఆదిశేషగిరిరావు చూసుకుంటూ వచ్చేవాడు..కృష్ణ చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఇటీవలే ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూ లో తన అన్నయ్య కృష్ణ తో తనకి చిన్నప్పటి నుండి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు..ముఖ్యంగా ఇటీవల కాలం లో ఇందిరా దేవి గారు చనిపోయినప్పుడు కృష్ణ ఎంత కృంగిపోయాడో చెప్పుకొచ్చాడు..ముందుగా యాంకర్ ‘కృష్ణ గారు మీ దగ్గర బాగా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయా’ అని అడగగా, అన్నయ్య ఎప్పుడూ ధైర్యం గా ఉండేవాడు..కానీ ఈమధ్య ఇందిరమ్మ చనిపోయిన తర్వాత మానసికంగా చాలా కృంగిపోయాడు..బయట ఇందిరమ్మ ని సరిగా చూసుకోడు అనే రూమర్ ఉండేది..కానీ కృష్ణ ఏనాడు కూడా ఆమెని తక్కువ చెయ్యలేదు..తన రెండు కళ్ళు లాగానే చూసుకునేవారు..అంటూ చెప్పుకొచ్చాడు.

విజయనిర్మల గారితో పెళ్లి జరిగినప్పుడు ఇందిరమ్మ తో గొడవలు రాలేదా..అని అడిగిన ప్రశ్న కి అది శేషగిరిరావు మాట్లాడుతూ ‘అప్పుడు నాకు 18 ఏళ్ళు ఉంటాయి..ఇలాంటి వ్యవహారాలు ఏమి పెద్దగా పట్టించుకోలేదు..అలాంటివన్నీ మా అమ్మగారు చూసుకునేవారు..పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు కానీ..వీళ్ళని మాత్రం వదలొద్దు అని చెప్పింది..అలా అన్నయ్య కూడా ఆమె మాటకు కట్టుబడే నడుచుకున్నారు..విజయ నిర్మల ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రోజు కృష్ణ ఇంటికి వచ్చేవాడు..ఆమె తో పెళ్లి జరిగిన తర్వాతే మహేష్ పుట్టాడు’ అని చెప్పుకొచ్చాడు ఆదిశేషగిరిరావు.