Adire Abhi: జబర్దస్త్ ఒక లెజెండరీ కామెడీ షో. పెద్దా చిన్నా, ఆడా మగా, క్లాసు మాసు అనే తేడా లేకుండా అందరినీ ఆకర్షించింది. 2013లో మల్లెమాల సంస్థ ప్రయోగాత్మకంగా జబర్దస్త్ స్టార్ట్ చేసింది. హిందీ కామెడీ షోలు దీనికి స్ఫూర్తి. అయితే టీమ్స్, స్కిట్స్ అంటూ భిన్నంగా ట్రై చేశారు. అనుకోకుండా సక్సెస్ అయ్యింది.డిమాండ్ పెరగడంతో జబర్దస్త్ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. రెండింటికీ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రష్మీ, అనసూయ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది… స్టార్స్ అయ్యారు. చమ్మక్ చంద్ర, మహేష్, రచ్చ రవి, అప్పారావు, చంటి, గెటప్ శ్రీను… పదుల సంఖ్యలో నటులుగా సెటిల్ అయ్యారు.

ఎందరికో జబర్దస్త్ లైఫ్స్ ఇచ్చింది. వారిలో అదిరే అభి కూడా ఒకరు. టీం లీడర్ అదిరే అభి జబర్దస్త్ సీనియర్స్ ఒకరు. ఆయన తాజాగా జబర్దస్త్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ”జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు… టైమింగ్ తో పంచులు వేసే టీం లీడర్స్.. కామెడీని అవపోసన పట్టిన కంటెస్టెంట్స్… అందరికీ అన్నంపెట్టే మల్లెమాల ఇది కదా మా కుటుంబం” అంటూ సుదీర్ఘంగా ఓ నోట్ షేర్ చేశారు.
దాని అర్థం ఏందయ్యా అంటే… జబర్దస్త్ లో ఒకప్పటి నవ్వులు లేవు. సందడి లేదు. జబర్దస్త్ వెలుగు కోల్పోయిందని. మా జబర్దస్త్ కి ఏదో అయ్యింది. దిష్టి తగిలిందని అదిరే అభి అభిప్రాయపడ్డారు. పరోక్షంగా జబర్దస్త్ పని అయిపోయిందని చెప్పకనే చెప్పాడు. అతను అన్న దాంట్లో వాస్తవం లేకపోలేదు. అయితే పబ్లిక్ గా చెప్పడం కొంత వివాదాస్పదం అవుతుంది. జబర్దస్త్ కమెడియన్ గా ఆయన షోపై నెగిటివ్ కామెంట్స్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక జబర్దస్త్ కి ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. నవ్వుల బాబు నాగబాబు జబర్దస్త్ వదిలేయడంతో ఇది మొదలైంది. ఆయన వెనుక చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి పేరున్న కమెడియన్స్ వెళ్లిపోయారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆదితో చాలా కాలం నెట్టుకొచ్చారు. వారు కూడా మల్లెమాల నుండి వెళ్లిపోయారు. హైపర్ ఆది మాత్రం రీఎంట్రీ ఇచ్చాడు. రోజా, అనసూయ తప్పుకోవడం మరింత దెబ్బతీసింది. ప్రస్తుతం జబర్దస్త్ షోలలో ఉన్నవన్నీ కొత్త టీమ్స్. వారు సీనియర్స్ మాదిరి కామెడీ పంచలేకపోతున్నారు. ఇలా పలు కారణాలు జబర్దస్త్ కి జనాల్లో ఆదరణ తగ్గడానికి కారణమయ్యాయి.
