Adipurush Teaser: ఆదిపురుష్ టీజర్ విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కారణం చాలా ఏళ్ల తర్వాత ఒక స్టార్ హీరో రాముని పాత్ర చేస్తున్నారు. ఈ దశాబ్దంలో బాలకృష్ణ మాత్రమే రామునిగా చేశారు. 2011 లో బాపు దర్శకత్వంలో విడుదలైన శ్రీ రామ రాజ్యం సినిమాలో ఆయన ఆ విశిష్టమైన పాత్రలో కనిపించారు. ఇక ఈ జనరేషన్ టాప్ స్టార్స్ లో ప్రభాస్ కి అవకాశం దక్కింది. ఎపిక్ రామాయణ గాథలో నటించే అదృష్టం ఆయన అందుకున్నారు.
రాముడుగా ప్రభాస్ ఎలా ఉంటాడనే సందేహం, ఆయన్ని అలా చూడాలనే ఆసక్తి ఆదిపురుష్ ప్రకటన నాటి నుండి ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం ఆదిపురుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సాంప్రదాయ రాముని గెటప్ కి భిన్నంగా దర్శకుడు ఓం రౌత్ చూపించారు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు భేష్ అంటే.. మరికొందరు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ దీనికి కంటే బాగున్నాయి అన్నారు.
Also Read: Koratala Shiva- Jr. NTR: ఎన్టీఆర్ మిడిల్ క్లాస్ కష్టాలు.. సంచలన కథ రాసిన కొరటాల శివ !
అయితే ఫస్ట్ లుక్ చూసి ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. నేడు విడుదల కానున్న టీజర్ తో అందరి అనుమానాలు పటాపంచలు కానున్నాయి. అయోధ్య వేదికగా ఆదిపురుష్ టీజర్ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీజర్ విడుదల ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆదిపురుష్ చిత్రాని భారీ హైప్ క్రియేట్ చేయడం ద్వారా అతిపెద్ద హిట్ గా మలచాలని ప్రణాళికలు వేస్తున్నారు. హిందూ సెంటిమెంట్ క్యాష్ చేసుకోవడం కోసం టీజర్ విడుదలకు రామజన్మభూమి అయోధ్యను ఎంచుకున్నారు.
కాగా టీజర్ విడుదలకు కొన్ని గంటల సమయం మిగిలి ఉండగా ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు టీజర్ తోనే సినిమాపై హైప్ తారాస్థాయికి తీసుకెళ్లాలి అనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది. ఆదిపురుష్ టీజర్ రెగ్యులర్ టీజర్స్ కంటే ఎక్కువ నిడివి కలిగి ఉంటుంది అంటున్నారు. టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ కానున్నాయట. విజువల్స్ కోసం అధిక మొత్తంలో టీం ఖర్చుపెట్టిన నేపథ్యంలో అద్భుతమైన గ్రాఫిక్ సీన్స్ చూపించనున్నారట. టీజర్ లో ఓ వీరోచిత, రౌద్ర రాముడిని పరిచయం చేయనున్నట్లు సమాచారం.