
Actress Sudha: సుధ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అమ్మ పాత్రలకు అన్నపూర్ణ తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్నారు. 90లలో మొదలైన ఆమె ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది. తమిళనాడులో పుట్టి పెరిన సుధ తెలుగులోనే అధికంగా చిత్రాలు చేశారు. ఆమెను అందరూ తెలుగు మహిళగానే చూస్తారు. హీరోయిన్ కావాలనుకున్న సుధ ఆలోచలను దర్శకుడు భాను చందర్ మార్చేశారట. నీ రూపానికి హీరోయిన్ గా కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా సక్సెస్ అవుతావని చెప్పారట. ఆయన చెప్పిన సలహా పాటించి యంగ్ ఏజ్ లోనే వదిన,అమ్మ పాత్రలు చేయడం స్టార్ట్ చేశారు.
500 వందలకు పైగా సినిమాల్లో నటించిన సుధ బాగా సంపాదించారట. అలాగే పెద్ద మొత్తంలో పోగొట్టుకున్నారట. మొదట స్వీట్ షాప్ పెట్టారట. ఆ వ్యాపారంలో అయినవాళ్లే మోసం చేశారట. అనంతరం ఢిల్లీలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశారట. అది సక్సెస్ కావడంతో మరో హోటల్ స్టార్ట్ చేశారట. అప్పుడు మొత్తంగా మునిగిపోయారట. వ్యాపారాలు మనకు అచ్చిరావని వాటిని వదిలేశారట. బుద్దిగా సినిమాలు చేసుకున్నారట. ఈ విషయాలు ఓ ఇంటర్వ్యూలో సుధ చెప్పుకొచ్చారు.
చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. వాటి విలువ రూ. 50 లక్షల వరకు ఉంటుందని సుధ తెలిపారు. వాటిని చింపకుండా అలానే ఉంచానని చెప్పుకొచ్చారు. డబ్బులు పోయినా ఇలానే నవ్వుతూ ఉంటాను. ఎందుకంటే బాధపడితే పోయిన డబ్బులు రావు కదా… అని సుధ హ్యాపీగా చెప్పారు.

ప్రెసిడెంట్ గారి పెళ్ళాం మూవీలో నాది వదిన రోల్. నాగార్జునతో చేస్తున్న మొదటి చిత్రం. కోదండరామిరెడ్డి దర్శకుడు. ఆయన్ని కలుద్దామని సెట్ కి వెళ్ళాను. చుడిదార్ లో ఉన్న నన్ను చూసి…ఈమె వదిన పాత్రకా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ నెక్స్ట్ డే షూటింగ్ కి ఆ సినిమా పాత్ర గెటప్ లో వెళ్ళాను. అప్పుడు చూసి ఆయన మళ్ళీ షాక్ అయ్యారు. నువ్వు కెమెరా ముందు ఒకలా కెమెరా వెనుక మరోలా ఉన్నావని అన్నారు… అంటూ సుధ చెప్పుకొచ్చారు. కారణం తెలియదు కానీ.. ఈ మధ్య సుధ సినిమాలు తగ్గించారు. 2021లో విడుదలైన ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ తర్వాత ఆమె తెలుగులో మూవీ చేయలేదు.