Senior Hero Naresh- Poojitha: పెళ్లి ప్రకటనతో నరేష్ -పవిత్ర లోకేష్ ల రచ్చ మరోసారి తెరపైకి వచ్చింది. 2022 డిసెంబర్ 31న నరేష్ నటి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఈ వార్త టాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. గతంలో నరేష్ పెళ్లిపై నమ్మకం లేదన్నారు. పవిత్రతో సహజీవనం చేస్తున్నానన్న నరేష్ పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. అయితే భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పలేను, అన్నారు. నరేష్ పెళ్లి ప్రకటనపై వారం తర్వాత రమ్య రఘుపతి స్పందించారు. ఆమె దారుణమైన ఆరోపణలు చేశారు.

నరేష్ తనను వదిలించుకోవడం కోసం దారుణాతి దారుణాలు చేశాడని కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ నాకు ఎఫైర్స్ అంటగట్టాడు. దేవుడు లాంటి కృష్ణగారితో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను అన్నాడు. కృష్ణగారికి నా వలన ప్రాణహాని ఉన్నట్లు ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేశాడు. అది కృష్ణ నాపై కంప్లైంట్ చేస్తున్నట్లు రాసి, ఆయన సంతకం ఫోర్జరీ చేశాడు. దాని ఆధారంగా కేసు పెట్టాడు. ఆ విషయం అసలు తెలియదు. నా కొడుకు ముందే పోర్న్ వీడియోలు చూసేవాడు. నరేష్-పవిత్రల వివాహం జరగనివ్వను. అతనికి విడాకులు ఇచ్చేది లేదు. నా కొడుకు తండ్రి కావాలని అడుగుతున్నాడంటూ… రమ్య సంచలన విషయాలు వెల్లడించారు.
ఈ క్రమంలో నరేష్-పవిత్ర లోకేష్- రమ్యల ట్రైయాంగిల్ డ్రామా మరిన్ని మలుపులు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నరేష్ పై మూడో భార్య దారుణ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సీనియర్ నటి పూజిత ఆయన మంచోడు అంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎవరూ తనకు సహాయం చేయని తరుణంలో నరేష్ ఆదుకున్నాడంటూ ఆమె వెల్లడించారు. రాజేంద్రప్రసాద్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఒక సహాయం కోసం ‘మా’ కార్యాలయానికి వెళ్ళాను.

నాతో కలిసి అనేక సినిమాలు చేసిన రాజేంద్రప్రసాద్ నేనెవరో కూడా తెలియనట్లు ప్రవర్తించాడు. నేను ఈసీ మెంబర్ గా ఉన్నప్పుడు ఆయన కూడా ఒక మెంబర్. మా మధ్య ఇంత పరిచయం ఉంది. అయినా ఆయన పట్టించుకోలేదు. కానీ నరేష్ నాకు సహాయం చేశారు. నా సమస్యను ఆయన తీర్చారు. నరేష్ చాలా మంచి వ్యక్తి కాకపోతే ఆయన ఒక శనిని నెత్తిన పెట్టుకున్నాడు. అదొక్కటే ఆయనలో ఉన్న చెడ్డ గుణం. నరేష్ మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నటుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, పూజిత వెల్లడించారు.