Iswarya Menon : స్పై మూవీతో టాలీవుడ్ లో పాగా వేయాలని చూసింది ఐశ్వర్య మీనన్. దర్శకుడు గ్యారీ బిహెచ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ స్ప్రె ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. హీరో నిఖిల్ ఏజెంట్ రోల్ చేశారు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా విడుదల చేశారు. మంచి స్టోరీ లైన్ ఎంచుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్ లో తడబడ్డారు. స్పై మూవీ ఐశ్వర్య మీనన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆమె నటించిన భారీ చిత్రం స్పై అని చెప్పొచ్చు.
ఇక స్పై ఫెయిల్యూర్ తో ఐశ్వర్యకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదు. ఐశ్వర్య పరిశ్రమకు వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. 2012లో విడుదలైన లవ్ ఫెయిల్యూర్ ఈమె మొదటి చిత్రాలు. సిద్దార్థ్ హీరోగా నటించగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. అమలా పాల్ ప్రధాన హీరోయిన్ రోల్ చేశారు. పదేళ్ల కెరీర్లో తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించింది. ఎక్కడా ఆమెకు బ్రేక్ రాలేదు.
ప్రస్తుతం బజూక టైటిల్ తో ఓ మలయాళ చిత్రం చేస్తుంది. ఈ చిత్ర హీరో మమ్ముటి కావడం విశేషం. ఐశ్వర్యకు ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు.బజూక విజయం సాధిస్తే, ఐశ్వర్య మీనన్ కి ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు. బజూకా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. గాయత్రీ అయ్యర్, దర్శకుడు గౌతమ్ మీనన్, దసరా ఫేమ్ షైన్ టామ్ చకో కీలక రోల్స్ చేస్తున్నారు.
ఐశ్వర్య మీనన్ అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు రెచ్చిపోయి స్కిన్ షో చేస్తుంది. గ్లామర్ ఫీల్డ్ లో అందాల ప్రదర్శన తప్పదు మరి. దర్శక నిర్మాతలను ఆకర్షించేందుకు ఐశ్వర్య మీనన్ ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ విందు చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఐశ్యర్యకు మూడు మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
తాజాగా డెనిమ్ షార్ట్ లో మైండ్ బ్లాక్ చేసింది. పొట్టి బట్టల్లో ఐశ్యర్య గ్లామర్ గిలిగింతలు పెడుతుంది. నెటిజెన్స్ సదరు ఫోటోలను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఐశ్వర్య అందాలు అదరహో అంటున్నారు. ఐశ్వర్య దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇక ఐశ్వర్య కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి…
View this post on Instagram