https://oktelugu.com/

Hema: దాని కోసం ప్రభాస్ కోటి రూపాయలు ఇస్తానన్నాడు.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: నటి హేమ. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారామే. ఎప్పుడూ ఏదో వివాదాన్ని రాజేస్తూ సంచలన వ్యాఖ్యలతో హోరెత్తిస్తారు. హేమ సినీ ఇండస్ట్రీ గురించి.. నటీనటుల గురించి చేసే వ్యాఖ్యలు దుమారం రేపుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి హేమ హాట్ కామెంట్స్ చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి. ‘మా’ అసోసియేషన్ లో గొడవల వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో నటి హేమ చెప్పుకొస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2022 / 08:37 PM IST
    Follow us on

    Hema: నటి హేమ. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారామే. ఎప్పుడూ ఏదో వివాదాన్ని రాజేస్తూ సంచలన వ్యాఖ్యలతో హోరెత్తిస్తారు. హేమ సినీ ఇండస్ట్రీ గురించి.. నటీనటుల గురించి చేసే వ్యాఖ్యలు దుమారం రేపుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి హేమ హాట్ కామెంట్స్ చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.

    ‘మా’ అసోసియేషన్ లో గొడవల వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో నటి హేమ చెప్పుకొస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు నష్టపోతున్నామని.. ఇగోలు, పరిపాలన వైఫల్యం వల్ల ఎంతో సేవా చేద్దామనుకున్నా భ్రష్టు పట్టిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక యూట్యూబ్ చానెల్ తో మాట్లాడిన హేమ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

    Also Read: Chandrababu: టీడీపీ కొంపముంచుతున్న కోటరీ.. కట్టడి చేయలేకపోతున్న చంద్రబాబు

    మా అసోసియేషన్ కు నిధుల సేకరణ గురించి ప్రభాస్ ను కలవడానికి వెళ్లామని నటి హేమ తెలిపారు. ప్రభాస్ ను అమెరికాలో ఈవెంట్ కు రమ్మన్నామని.. కానీ ప్రభాస్ పెద్ద మనసుతో కోటి రూపాయలు తాను అసోసియేషన్ ఇస్తానని గొప్ప మనసుతో చెప్పాడని హేమ తెలిపింది. అయితే కోటి ఇవ్వడం కంటే మీరు వస్తే మరో రెండు కోట్లు వస్తాయని.. రావాలని ఒప్పించామని హేమ తెలిపారు.

    ప్రభాస్ మాత్రమే కాదు.. మహేష్ బాబు కూడా వస్తానన్నారని.. ఈ కార్యక్రమం జరిగి ఉంటే మా అసోసియేషన్ కు ఆర్థిక కష్టాలే ఉండేవి కావని తెలిపారు. కానీ అది జరగకుండా మా అసోసియేషన్ లో ఓ కార్యదర్శి వివాదాలు రాజేసి అసలు ఫంక్షన్లే జరగకుండా చేశాడని.. అది ఎవరో మీకు తెలుసు అని.. అతడి వల్లే అసోసియేషన్ సర్వ నాశనమవుతోందని హేమ వాపోయారు.

    మా అసోసియేషన్ కు వచ్చే ఆదాయం రూ.3 లక్షలని.. కానీ ఖర్చు మాత్రం 20 లక్షలు చేస్తున్నారని.. ఇది దారుణం అని మా అధిష్టానంపై హేమ నిప్పులు చెరిగారు.

    Also Read: Allu Aravind- Mahesh Babu: ఆ పెద్ద హీరో స్టేజ్ పై డాన్స్ చేశాడు… మహేష్ ని ఉద్దేశిస్తూ అల్లు అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్

    Recommended Videos:


    Tags