https://oktelugu.com/

Anasuya Bharadwaj: సుధీర్, ఆది బాటలో అనసూయ.. మల్లెమాలకు, ఈటీవీకి పెద్ద దెబ్బనే?

Anasuya Bharadwaj: ఈ మధ్యకాలంలో ప్రొడక్షన్ హౌస్ మల్లెమాలకు ఏదీ కలిసిరావడం లేదు.ఈటీవీలో కలిసి వారు సృష్టించిన కార్యక్రమాలు బుల్లితెరపై ఎంతో హిట్ అయ్యాయి. జబర్ధస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో లు ఇలా ఎంతో హిట్ అయ్యాయి. అయితే చేజేతులారా మంచి టాలెంట్ ఉన్న వారికి ఆంక్షలు పెట్టి.. పారితోషికం విషయంలో బెట్టు చేసి అందరినీ పొగొట్టుకొని ఇప్పుడు మొదటికే మోసం తెచ్చుకుందన్న టాక్ వినిపిస్తోంది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 29, 2022 / 03:29 PM IST
    Follow us on

    Anasuya Bharadwaj: ఈ మధ్యకాలంలో ప్రొడక్షన్ హౌస్ మల్లెమాలకు ఏదీ కలిసిరావడం లేదు.ఈటీవీలో కలిసి వారు సృష్టించిన కార్యక్రమాలు బుల్లితెరపై ఎంతో హిట్ అయ్యాయి. జబర్ధస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో లు ఇలా ఎంతో హిట్ అయ్యాయి. అయితే చేజేతులారా మంచి టాలెంట్ ఉన్న వారికి ఆంక్షలు పెట్టి.. పారితోషికం విషయంలో బెట్టు చేసి అందరినీ పొగొట్టుకొని ఇప్పుడు మొదటికే మోసం తెచ్చుకుందన్న టాక్ వినిపిస్తోంది.

    Anasuya Bharadwaj

    సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు జబర్ధస్త్ లోనే పుట్టారు పెరిగారు. దాన్ని ఒక లెవల్ కు చేర్చారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో తేడా కొట్టడం.. రూ.10లక్షల బాండ్, ఇతర టీవీల్లో కనిపించవద్దన్న డిమాండ్ కారణంగా వీరి అగ్రిమెంట్ ముగియడంతో జబర్ధస్త్ ను వీడిపోయారు. ఫ్రీగా వదిలేస్తే వారు జబర్ధస్త్ లో ఉండేవారే.కానీ మల్లె మాల ఆంక్షల వల్లే మంచి టాలెంట్ ఉన్న వారు వెళ్లిపోయారని టాక్ నడుస్తోంది.

    Also Read: Chor Baazar 5th Day Collections: ‘చోర్ బజార్’ ’5 డేస్ కలెక్షన్స్’.. ఎన్ని కోట్లు నష్టం అంటే ?

    బుల్లితెరపై ఎవర్ గ్రీన్ హాట్ యాంకర్ ఎవరయ్యా అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు ‘అనసూయ’. ఇద్దరు బిడ్డల తల్లి అయినా కూడా అనసూయ అందచందాలకు ఆకర్షితులు అవ్వని వారు ఉండరు. అంతలా గ్లామర్ ఒలకబోసే ఈ అందాల రాశి ఈ మధ్య సినిమాల్లోనూ బాగానే అవకాశాలు దక్కించుకొని పాపులర్ అయిపోయింది.

    Anasuya Bharadwaj

    మల్లెమాల పెట్టే కండీషన్లు.. ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే పక్కనున్న మాటీవీ ఇచ్చేది ఎక్కువ. దాంతోపాటు ఇష్టమొచ్చింది బయట చేసుకోవడానికి వాళ్లు అభ్యంతర పెట్టరు. ఇలా జబర్ధస్త్ లో పాపులర్ అయిన అందరినీ మాటీవీ లాగేస్తోంది. ఇప్పటికే సుధీర్, ఆది వెళ్లిపోగా.. తాజాగా అనసూయ కూడా ఆ జాబితాలో చేరింది. దీంతో జబర్ధస్త్ సహా ఈటీవీ షోలు కళ తప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

    అనసూయ తాజాగా సంచలన మెసేజ్ పెట్టింది. ‘ నా కెరీర్ పరంగా ఇది పెద్ద నిర్ణయమని.. జ్ఞాపకాలన్నీ తీసుకెళుతున్నానని.. కాకపోతే ఎప్పటిలాగానే మీ ఆదరణ నాపై ఉంటుందని భావిస్తున్నానని’ అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఈమె జబర్ధస్త్ ను వీడి ఈ మెసేజ్ పెట్టిందని బుల్లితెరలో టాక్ నడుస్తోంది.

    ఇప్పటికే పెద్ద దిక్కులైన నాగబాబు, రోజా వెళ్లిపోవడంతోనే జబర్ధస్త్ కళ తప్పింది. వారి తర్వాత సుధీర్, ఆది వైదొలగడం మరింత దెబ్బతీసింది. ఇప్పుడు అనసూయ ఎగ్జిట్ తో జబర్ధస్త్ షో మరింతగా తేలిపోవడం ఖాయమంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

    Also Read:The Warrior Trailer Review: అటు ఎమోషన్స్ ఇటు యాక్షన్.. ఎక్స్ లెంట్

    Tags