Actor Satya Dev
Actor Satya Dev: విలక్షణ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు సత్య దేవ్. ఒక ప్రక్క హీరోగా చేస్తూనే విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. గత ఏడాది సత్యదేవ్ నుండి ఐదు సినిమాలు విడుదలయ్యాయి. గాడ్సే, గుర్తుందా శీతాకాలం చిత్రాల్లో హీరోగా నటించారు. ఆ రెండు భిన్నమైన జోనర్స్ లో తెరకెక్కాయి. గాడ్సే పొలిటికల్ సెటైరికల్ డ్రామా కాగా గుర్తుందా శీతాకాలం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇక గాడ్ ఫాదర్ మూవీలో విలన్ గా, ఆచార్యలో కామ్రేడ్ రోల్ చేశారు. చరణ్ కంటే చిన్నవాడైన సత్యదేవ్ ఆయన తండ్రి పాత్ర చేయడం విశేషం. రామ్ సేతు మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన రామ్ సేతు చిత్రంలో శ్రీలంక జాలరి పాత్ర చేశారు. రాముని ఆనవాళ్లు కనిపెట్టడంలో సహాయపడే హనుమంతుడు షేడ్స్ సత్యదేవ్ పాత్ర కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఆయన హీరోగా కృష్ణమ్మ, ఫుల్ బాటిల్ టైటిల్ తో రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. నటుడిగా సత్యదేవ్ గురించి మనకు తెలుసు. ఆయన ఫ్యామిలీ, వైఫ్, చిల్డ్రన్స్ వంటి వ్యక్తిగత విషయాలపై అవగాహన లేదు.
తాజాగా సత్యదేవ్ తన ఫ్యామిలీ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పిక్ చూసిన అభిమానులు షాక్ అయ్యారు. సత్యదేవ్ కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా! అని వాపోతున్నారు. సత్యదేవ్ కొడుకు పేరు సావర్నిక్. ఇటీవల బర్త్ డే జరుపుకున్న సావర్నిక్ మూడవ ఏట అడుగుపెట్టాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొడుక్కి బర్త్ డే విషెస్ చెప్పాడు. పక్కనే భార్య కూడా ఉంది. ఏదో విదేశీ ట్రిప్ లో దిగిన ఫోటో అని అర్థం అవుతుంది. కొడుకు జన్మదిన వేడుకల కోసం టూర్ ప్లాన్ చేసినట్లున్నారు.
Actor Satya Dev
సత్యదేవ్ భార్య పేరు దేవిక. వీరికి 2020లో అబ్బాయి సావర్నిక్ పుట్టాడు. సినిమాల్లో సత్యదేవ్ వయసుకు మించిన పాత్రలు చేస్తూ ఉంటాడు. 1989 జులై 4న జన్మించిన సత్యదేవ్ వయసు కేవలం 33 ఏళ్ళు మాత్రమే. ఈ వయసుకే పెళ్ళై మూడేళ్ళ కొడుకున్నాడంటే విశేషమే మరి. కారణం… యాక్టింగ్ కెరీర్ గా ఎంచుకున్నవారు పెళ్లి అంటే ససేమిరా అంటారు. ముప్పై ఏళ్ల లోపు వివాహం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆ లెక్కన సత్యదేవ్ ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నట్లు లెక్క. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్, అల్లు అర్జున్ వంటి కొందరు హీరోలు మాత్రమే రైట్ ఏజ్ లో వివాహం చేసుకున్నారు.