Nassar : బహుభాషా చిత్రాల్లో తనదైన శైలిలో నటించి పాపులర్ అయిన తమిళ నటుడు ‘నాజర్’. దక్షిణాది, ఉత్తరాదిలోనూ హీరోగా, విలన్ గా, కమెడియన్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రల్లో మెరుస్తుంటాడు.
![]()
తాజాగా హైదరాబాద్ పోలీస్ ఎకాడమీ షూటింగ్ సమయంలో నటుడు నాజర్ కు గాయాలయ్యాయి. ఆయనను దగ్గర లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కన్ను కింద కణతి భాగంలో స్వల్ప గాయాలయ్యాయని తెలిసింది. మైనర్ ఇంజ్యూర్ అనీ తెలిపిన వైద్యులు చికిత్స అందించారు. ఆయనకు రక్తస్రావం కావడం వల్ల.. చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నాజర్ ఇంటికి వెళ్లిపోయినట్టు తెలిసింది.
తమిళ్ సినిమా షూటింగ్ లో నటి సుహాసిని,హీరోయిన్ మెహ్రీన్, శియాజి శిండే లతో తెలంగాణ పోలీస్ అకాడమి లో షూటింగ్ నిర్వహించారు. మెట్ల పై నుంచి దిగుతున్న సమయంలో జరి పడిన నాజర్ కు ఈ గాయాలయ్యాయని తెలిసింది.
నాజర్ కు గాయాలు అని తెలుసుకున్న సన్నిహితులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలిన ప్రార్థిస్తున్నారు.
నాజర్ 1985లో ‘కల్యాణ అగితీగల్’ అనే తమిళ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశాడు. ఆతర్వాత ‘నాయకన్’ సినిమాతో పాపులర్ అయ్యాడు. ‘రోజా’, తేవర్ మగన్, బొంబాయి, కురుతి పునల్ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించి పాపులర్ అయ్యాడు. బాహుబలి, పోకిరి లాంటి చిత్రాలతో మంచి పేరు పొందారు. ఇప్పటి దాకా 100కు పైగా చిత్రాల్లో నటించారు.