Actor Brahmaji vs Minister Roja : వైసీపీ మంత్రి రోజాకు నటుడు బ్రహ్మాజీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చిన్న ఆర్టిస్టులేగా అంత భయమెందుకు అంటూ చురకలు అంటించారు. బ్రహ్మాజీ రియాక్ట్ ఎందుకయ్యారు. ఆయన రోజాకు ఎందుకు సమాధానం చెప్పారని పరిశీలిస్తే… రోజా మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీకి మద్దతుగా ఏ ఆర్టిస్ట్ మాట్లాడినా అది ప్రేమతో కాదు. కేవలం భయంతో మాత్రమే. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఉన్నారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే పరిశ్రమలో లేకుండా చేస్తారు. మెగా ఫ్యామిలీ అంటే ఆర్టిస్ట్స్ కి భయం ఉంది కానీ ప్రేమ కాదు.

నిజంగా ప్రేమ ఉంటే… మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో వారు సప్పోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ఎందుకు గెలవలేదు. దీన్ని బట్టి క్లియర్ గా అర్థం అవుతుంది. అందుకే నేను చిన్న చిన్న ఆర్టిస్ట్స్ కామెంట్స్ కి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళను నేను విమర్శించాలని అనుకోవడం లేదన్నారు. రోజా మాటలను బ్రహ్మాజీ ఖండించారు. ఆమె మాట్లాడిన వీడియో తన ట్వీట్ లో ట్యాగ్ చేస్తూ…’నన్నెవరూ మెగా ఫ్యామిలీకి క్యాంపైన్ చేయమని కోరలేదు. పార్టీలో చేరమనలేదు. అయినా చిన్న ఆర్టిస్టులే కదా అంత భయమెందుకు’ అని కామెంట్ చేశారు.
నేను చిరంజీవి కుటుంబంపై ప్రేమతో అభిమానిస్తున్నాను. భయంతో కాదు. అదే సమయంలో చిన్న ఆర్టిస్ట్స్ అని మీరే అంటున్నారు కదా. వాళ్ళ కామెంట్స్ కి కూడా మీరెందుకు బయపడతారని నేరుగా ప్రశ్నించారు. ఇటీవల ఓ ఈవెంట్లో చిరంజీవి గురించి మాట్లాడుతూ బ్రహ్మాజీ ఎమోషనల్ అయ్యారు. ఆయనేమిటో మాకు తెలుసు. అనుచిత కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం రోజా పలుమార్లు చిరంజీవి ఫ్యామిలీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు.
చిరంజీవి ఫ్యామిలీ సమాజానికి చేసిన సహాయం ఏమీ లేదు. సొంత జిల్లా, ఊరికి కూడా మేలు చేయలేదు. అందుకే అక్కడ ఓడిపోయారు. మెగా బ్రదర్స్ కి రాజకీయ భవిష్యత్తు లేదని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా ఆరోపణలపై నాగబాబు మండిపడ్డారు. ఆమె నోరు మున్సిపాలిటీ చెత్త బుట్ట, అందుకే నేను ఆమె గురించి మాట్లాడను అంటూ గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. హైపర్ ఆది యువశక్తి సభలో వైసీపీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో రోజా తాజా కామెంట్స్ చేశారు.
నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ campain చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు .
చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత బయపడతారెందుకు .. https://t.co/9W0gU2uF98— Brahmaji (@actorbrahmaji) January 19, 2023