https://oktelugu.com/

Chiranjeevi Ram Charan: కొడుకును డామినేట్ చేయడానికి చిరంజీవి స్కెచ్.. తగ్గేదేలే అన్న రాంచరణ్

Acharya – Bhale Bhale Banjara Song : చిరంజీవి.. వెండితెరపై మెగాస్టార్ గా ఎదిగాడంటే ఆయన స్టైల్, గ్రేస్ వల్లే సాధ్యమైంది. చిరంజీవి స్టైల్ కా బాప్ అని చెప్పొచ్చు. ఆయన ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా డ్యాన్స్ చేయగలడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే దర్శకుడు కొరటాల శివ తన తాజాగా చిత్రం ‘ఆచార్య’లో చిరంజీవికి, చరణ్ కు పోటీపెట్టాడు. అయితే ఆర్ఆర్ఆర్ లో ‘నాటునాటు’ సాంగ్ లో ఇరగదీసిన రాంచరణ్ డ్యాన్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2022 / 06:53 PM IST
    Follow us on

    Acharya – Bhale Bhale Banjara Song : చిరంజీవి.. వెండితెరపై మెగాస్టార్ గా ఎదిగాడంటే ఆయన స్టైల్, గ్రేస్ వల్లే సాధ్యమైంది. చిరంజీవి స్టైల్ కా బాప్ అని చెప్పొచ్చు. ఆయన ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా డ్యాన్స్ చేయగలడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే దర్శకుడు కొరటాల శివ తన తాజాగా చిత్రం ‘ఆచార్య’లో చిరంజీవికి, చరణ్ కు పోటీపెట్టాడు.

    అయితే ఆర్ఆర్ఆర్ లో ‘నాటునాటు’ సాంగ్ లో ఇరగదీసిన రాంచరణ్ డ్యాన్స్ కు మెగాస్టార్ కాంపిటీషన్ ఇస్తాడా? లేదా? అన్నది డౌట్. ఈ డౌట్ ను అన్నది ఎవరో కాదు సాక్ష్యాత్తూ చిరంజీవినే. అవును తాజాగా ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక సాంగ్ లో చరణ్, చిరంజీవి కలిసి డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫాస్ట్ బీట్ విన్న చిరంజీవి సందేహ పడ్డారు.

    కానీ తనయుడు రాంచరణ్ కు చిరంజీవి తర్వాత సవాల్ చేశారు. ‘ఆచార్య’లో ‘భలేభలే బంజారా’ పాటలో డ్యాన్స్ స్టెప్పులు ఎవరెలా వేస్తారో సెట్ లో చూసుకుందామంటూ చాలెంజ్ విసిరారు. ఆ పాట షూటింగ్ కు వెళ్లేముందు దర్శకుడు కొరటాల శివతో చిరంజీవి, రాంచరణ్ చర్చించారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్న ఈ పాటపై మంతనాలు జరిపారు.

    ఆర్ఆర్ఆర్ లో నాటునాటు సాంగ్ లో తారక్, చరణ్ అదరగొట్టారని.. చరణ్ తో డ్యాన్స్ అంచనాలు అందుకోవాలంటే కష్టపడక తప్పదని చిరంజీవి అన్నారు. అయితే తాను మాత్రం డ్యాన్స్ లో తగ్గనంటూ రాంచరణ్ స్పష్టం చేశారు. దీంతో సెట్ లో చూసుకుందాం కెమెరా ముందు అంటూ చిరంజీవి తన కుమారుడు చరణ్ కు సవాల్ చేశారు.

    తాను మాత్రం డామినేట్ చేయనని.. కానీ ఎక్కడా తగ్గనని ప్రతి సవాల్ చేశారు. తండ్రీకొడుకులిద్దరూ కలిసి తొలిసారి పూర్తి స్థాయిలో చేసిన ‘భలేభలే బంజారా’ పాట ఈనెల 18న విడుదల కానుంది. ఈ పాట కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యే ఆచార్య సినిమాలో మరి వీరిద్దరూ ఈ పాటలో ఎలా ఆడిపాడారో చూసి తరించాల్సిందే.