https://oktelugu.com/

Saana Kastam Lyrical Song: సాంగ్ అదిరింది.. రెజీనా, మెగాస్టార్ పోటీ పడి స్టెప్పులేశారు !

Saana Kastam Lyrical Song: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య మాస్ బిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు ఫలించాయి. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన “షానా కష్టం” అంటూ సాగే మాస్‌ సాంగ్‌ అదిరిపోయింది. ఈ పాటలో హీరోయిన్ రెజినా, మెగాస్టార్ ఇద్దరూ పోటీ పడి మరీ స్టెప్పులేశారు. వయసు మీద పడినప్పటికీ మెగాస్టార్ తన స్టెప్పులతో ఇరగదీశారు. మొత్తానికి ఈ సాంగ్ మెగా ఫాన్స్ తో […]

Written By:
  • Shiva
  • , Updated On : January 3, 2022 / 06:09 PM IST
    Follow us on

    Saana Kastam Lyrical Song: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య మాస్ బిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు ఫలించాయి. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన “షానా కష్టం” అంటూ సాగే మాస్‌ సాంగ్‌ అదిరిపోయింది. ఈ పాటలో హీరోయిన్ రెజినా, మెగాస్టార్ ఇద్దరూ పోటీ పడి మరీ స్టెప్పులేశారు. వయసు మీద పడినప్పటికీ మెగాస్టార్ తన స్టెప్పులతో ఇరగదీశారు. మొత్తానికి ఈ సాంగ్ మెగా ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తోంది.

    Saana Kastam Lyrical Song

    చిరంజీవితో పాటు రెజీనా కూడా డ్యాన్స్ తో అదరగొట్టింది. అయితే, చిరు తన వింటేజ్ గ్రేస్ స్టెప్పులతో అభిమానులను ఈ సాంగ్ తో ఫిదా చేయడం ప్రత్యేక ఆకర్షణ. అన్నట్టు ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ.. చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోనీ.. ’ అంటూ సాగిన లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం కూడా ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా “ఆచార్య” సినిమా రిలీజ్ కి సిద్ధం అయింది.

    Also Read: మొద‌ట్లో చిరంజీవికి వీరాభిమాని.. క‌ట్ చేస్తే మెగాస్టార్ కే బంపర్ హిట్లు ఇచ్చిన స్టార్ డైరెక్టర్..

    అందుకే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా మంచి బజ్ ఉంది. అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.

    ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన ‘లాహే లాహే’ పాట కూడా విపరీతమైన బజ్ తో పాటు ఫుల్ వ్యూస్ తో ఇప్పటికే 80 మిలియన్ల రికార్డ్ వ్యూస్ ను దక్కించుకుని మెగాస్టార్ స్టార్ డమ్ అంటే ఏంటో రుచి చూపించింది.

    Also Read: అలాంటి వాళ్ళని వదిలేదు లేదు అంటున్న బాలయ్య… ఎదురుపడితే దబిడిడిబిడే అంటూ వార్నింగ్ ?

    Tags