Viral Video: సోషల్ మీడియా వచ్చాక రీల్స్ చేయడం, ఓవర్‌నైట్ స్టార్స్ కావడం పెరిగింది. చాలా మంది లైక్స్, షేర్స్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్‌తో రీల్స్ చేస్తున్నారు. కొందరు సరదా రీల్స్, కొందరు డ్యాన్స్, కామెడి, చిట్కాలు, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, వంటలు ఇలా అనేకం చేస్తూ లైక్స్, షేర్స్, వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఇక కొందరు రైళ్లలో రీల్స్ చేయడం ఇటీవల కామన్ అయింది.
ఎయిర్ పోర్టులో..
ఇప్పుడు ఈ ట్రెండ్ ఎయిర్‌పోర్టుకు కూడా పాకింది. ఓ యువతి ఎయిర్‌పోర్టులోని బ్యాగేజ్ కన్వేయర్ బెల్టుపై రీల్ చేసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇప్పుడిది వైరల్‌గా మారింది. యువతి ఈ రీల్ చేస్తుండగా బ్యాక్ గ్రౌండ్‌లో హిందీ సినిమా పాట ప్లే అయింది. ఇక ఈ వీడియోను ఎక్స్‌లో దేసి మోజిటో అనే హ్యాండిల్‌లో పోస్టు చేశారు.
35 లక్షల వ్యూస్..
ఇక ఈ వీడియో పోస్టు చేసినప్పటి నుంచి 35 లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. రీల్స్ వైరల్ కావడం కోసం ఎయిర్ పోర్టులో కూడా ఇలా చేస్తున్నారా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరికొందరు ఆ యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరికొందరు ఎయిర్ పోర్టులో బ్యాగేజ్ బెల్ట్ అంత చెత్త ప్రదేశం మరొకటి ఉండదు. దానిపై దొర్లుతారా అని కామెంట్ చేశాడు.
మెట్రోలో రీల్స్‌పై నియంత్రణ..
ఇదిలా ఉండగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు మెట్రో రైళ్లలో యువత రీల్స్ చేయడం కామన్ అయింది. రోజు రోజుకూ రీల్స్ సోషల్ మీడియాలో పెరుగుతుండడంతో స్పందించిన మెట్రో సంస్థ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. రీల్స్ చేసినట్లు గుర్తిస్తే రైల్వే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఎయిర్ పోర్టులో రీల్ చేసిన అమ్మాయిపై అధికారులు ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి.
The virus has reached the airports too pic.twitter.com/RdFReWtWjH
— desi mojito (@desimojito) March 29, 2024