Homeట్రెండింగ్ న్యూస్Haryana: రీల్స్ పిచ్చికి పరాకాష్ట.. అందరూ చూస్తుండగానే ఆ పని.. లెంపలు వాయించిన వ్యాపారి.. వైరల్...

Haryana: రీల్స్ పిచ్చికి పరాకాష్ట.. అందరూ చూస్తుండగానే ఆ పని.. లెంపలు వాయించిన వ్యాపారి.. వైరల్ వీడియో

Haryana: ఇలా రీల్స్ చేస్తున్న వారిలో కొంతమంది సెలబ్రిటీలు కావడంతో.. వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది వినూత్నంగా రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్ లో వినూత్నత ఉంటే బాగుండేది. ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోవాలని భావించి చాలామంది రీల్స్ లో తమ పిచ్చిని ప్రదర్శిస్తున్నారు. నెత్తి మాసిన పనులు చేస్తూ సభ్య సమాజం దృష్టిలో పరువు పోగొట్టుకుంటున్నారు. గతంలో కర్ణాటకలో ఓ యువతి రీల్స్ చేయడానికి కొండమీదికి ఎక్కింది. అక్కడ రీల్స్ చేస్తుండగా కాలుజారి లోయలో పడి చనిపోయింది. ఇక మహారాష్ట్రలో ఆ మధ్య కార్ డ్రైవింగ్ చేస్తూ ఓ యువతి రీల్స్ చేయడం ప్రారంభించింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువతి దుర్మరణం పాలయింది. ఇక ఢిల్లీలో రైలు లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడు రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రీల్స్ పిచ్చి వల్ల ఎంతోమంది బాధితులుగా మిగిలిపోయారు. ఆయనప్పటికీ మిగతా వారికి బుద్ధి రావడం లేదు. తాజాగా హర్యానాలో రీల్స్ కోసం ఓ వ్యక్తి చేసిన పని సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.

ఆ పని చేసి..

హర్యానాలో పానిపట్ ప్రాంతంలో ఇన్సార్ అనే పేరుతో ఒక మార్కెట్ ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఒక జాతర లాగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో జనం వస్తుంటారు కాబట్టి.. అతిపెద్ద మాల్ కావడంతో కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా భారీగా వస్తుంటారు. అందువల్ల అక్కడ నిత్యం సందడి వాతావరణం కనిపిస్తుంది. అయితే ఓ యువకుడు అక్కడ రీల్స్ చేయాలని భావించాడు. అతడు మామూలుగా రీల్స్ చేసుకొని ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అయితే అంత జనం మధ్యలో అతడు చేసిన పని చాలా ఇబ్బంది కలిగించింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలని ఉద్దేశంతో అతడు అందరు చూస్తుండగానే ఒక యువతి లాగా “లోదుస్తులు” వేసుకొని సంచలనం సృష్టించాడు. అత్యంత అసభ్యకరంగా నృత్యాలు చేశాడు. దీంతో అక్కడున్న ఆడవాళ్లు ఇబ్బంది పడ్డారు. రీల్స్ కోసం ఆ యువకుడు చేస్తున్న అతి ఓ వ్యాపారికి చిరాకు తెప్పించింది. పట్టరాని కోపంతో అతడు అక్కడికి వెళ్లి ఆ యువకుడు చేస్తున్న పనిని అడ్డుకున్నాడు. అంతేకాదు రెండు చేతులతో లెంపలు వాయించాడు. చెంపలు కందిపోయేలాగా నాలుగు పీకులు పీకాడు. దీంతో ఆ యువకుడు తన తప్పు తెలుసుకుని వెనక్కి వెళ్ళాడు. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ” చెంపలు కాదు వాయించాల్సింది.. ఇంకా చాలా చేయాలి. అలా చేస్తేనే ఈ రీల్స్ బ్యాచ్ కు బుద్ధి వస్తుంది. లేకుంటే వీరి ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలి. ఆడవాళ్లు మార్చుకునే లో దుస్తులను ఇలా అసభ్యంగా చూపించడం ఎంతవరకు సమంజసం? చుట్టూ ఆడవాళ్లు ఉన్నారనే సోయి కూడా లేకపోతే ఎలా.. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారు కదా? వాళ్లు ఇబ్బందులు పడరా? సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యేందుకు ఇలాంటి పనులు చేస్తారా అంటూ” నెటిజన్లు మండిపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular