Homeట్రెండింగ్ న్యూస్Uttar Pradesh Love Story: ఇంతకన్నా దరిద్రం ఉండదేమో.. ప్రియుడి తండ్రితో లేచిపోయిన యువతి.. ఎందుకో...

Uttar Pradesh Love Story: ఇంతకన్నా దరిద్రం ఉండదేమో.. ప్రియుడి తండ్రితో లేచిపోయిన యువతి.. ఎందుకో తెలుసా?

Uttar Pradesh Love Story: నిన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రియుడిక తన పిల్లలను ఎరవేసింది ఓ తల్లి. రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి వద్దకు తన కూతుళ్లను పంపించి పిల్లలు కనేలా చేసింది. ఇదే అమానవీయ ఘటన అనుకుంటే.. తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక విచిత్రమైన ప్రేమకథ వెలుగు చూసింది. యువకుడిని ప్రేమించిన ఓ యువతి అతడితో ప్రేమ బంధంలో ఉంటూనే అతడి తండ్రికి కూడా దగ్గరయింది. చివరికి ప్రియుడి తండ్రితో ఇంటి నుంచి పారిపోయింది. ఢిల్లీలో సహజీవనం చేస్తున్న వాళ్లిద్దరినీ ఏడాది తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.

పరిచయం.. ప్రేమ.. తండ్రితో రిలేషన్‌షిప్‌..
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఔరియాకు చెందిన కమలేష్‌ పని కోసం కాన్పూర్‌లోని చకేరీ ప్రాంతానికి వచ్చి అక్కడే నివసిస్తున్నాడు. కమలేష్‌కు 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడు భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. ఆ యువకుడికి స్థానికంగా ఉండే 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. యువకుడు తన ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లి తండ్రి కమలేష్‌కు పరిచయం చేశాడు. యువకుడి కోసం యువతి తరచూ కమలేష్‌ ఇంటికి వచ్చేది. అతడు ఇంట్లో లేనప్పుడు కమలేష్‌తో మాట కలిపేది. అలా వాళ్లు మరింత దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.

ఇంట్లో నుంచి పారిపోయి…
వాళ్ల సంబంధం ముదిరి పాకాన పడడంతో ఇంట్లోంచి వెళ్లిపోవాలని యువతి, కమలేష్‌ నిర్ణయించుకున్నారు. గత ఏడాది మార్చిలో ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. కమలేష్‌ కుమారుడు ఇంట్లోనే ఉండడంతో యువతి తల్లిదండ్రులకు అతడిపై ఎలాంటి అనుమానం రాలేదు. దీంతో వాళ్లు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. విచారణలో కమలేష్‌ను యువతి ఎక్కువగా కలిసేదని పోలీసులు తెలుసుకున్నారు. అతడి కుమారుడిని స్టేషన్‌కు పిలిపించి ఈ విషయమై విచారించారు. తన తండ్రి యువతితో చనువుగా మెలిగేవాడని.. ఆమె కూడా తరచూ ఇంటికి వచ్చేదని అతడు పోలీసులకు వివరించాడు.

ఢిల్లీలో అరెస్ట్‌..
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కమలేష్‌ ఢిల్లీలో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లగా కమలేష్‌తో సదరు యువతి సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇద్దరిని అరెస్టు చేసి చకేరీకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. తాను ఇష్టపూర్వకంగానే కమలేష్‌తో వెళ్లానని, అతడితోనే జీవిస్తానని యువతి చెబుతుండడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular