Rahul Gandhi party video: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ అడ్డంగా బుక్కయ్యారు. ఆయన పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ సైలెంట్ గా దేశంలో మాయమై.. ఏ దేశానికి వెళుతున్నాడో కూడా చెప్పకుండా రాహుల్ చెక్కేస్తుంటారు. కొన్ని రోజులు హాలీడే ఎంజాయ్ చేసి తిరిగి వస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ గాంధీ ఎంజాయ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆయన అమ్మాయిలతో కలిసి నైట్ పార్టీలో ఎంజాయ్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దాన్ని బీజేపీ వైరల్ చేస్తూ.. అందరు నేతలు షేర్ చేస్తూ రాహుల్ ను బుక్ చేస్తున్నారు. ఇదేందయ్యా అంటూ విరుచుకుపడుతున్నారు.
Also Read: Minister KTR: మంత్రి కేటీఆర్ కు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నారు?
రాహుల్ గాంధీ తాజాగా మన పక్క దేశం నేపాల్ లోని ఓ నైట్ క్లబ్ లో పార్టీ చేసుకున్న ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆయనతోపాటు నేపాల్ లోని చైనా రాయబారి కూడా ఉన్నట్లు వార్తలు రావడంతో బీజేపీ నిప్పులు చెరిగింది. కొందరు బీజేపీ నేతలు ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ ను చెడుగుడు ఆడుతున్నారు.
కాగా రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ పాపులర్ నైట్ క్లబ్ లో అమ్మాయిలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ సోమవారం నేపాల్ వచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది. రాహుల్ తన స్నేహితులతో కలిసి మారియట్ హోటల్ లో బస చేసినట్లు తెలిపాయి.
ఇక రాహుల్ తోపాటు కనిపిస్తున్న మహిళ నేపాల్ లోని చైనా రాయబారి అని తెలుస్తోంది. దీంతో బీజేపీకి అస్త్రం దొరికినట్టైంది. బీజేపీ నేత కపిల్ మిశ్రా ఈ వీడియోను షేర్ చేసి.. ‘రాహుల్ వ్యక్తిగత జీవితం గురించి తమకు అవసరం లేదని.. కానీ చైనీస్ ఏజెంట్లతో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తామని’ తెలిపారు.
Also Read: Tanushree Dutta Accident: బాలయ్య హీరోయిన్ కి యాక్సిడెంట్.. ఇప్పుడెలా ఉంది అంటే ?
దీనిపై కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. ఓ మిత్రదేశంలో స్నేహితుడి పెళ్లికి రాహుల్ వెళ్లడం నేరమేమీ కాదని పేర్కొంది. ప్రధాని మోడీ మాదిరిగా పిలవని పేరంటానికి శత్రుదేశం పాకిస్తాన్ వెళ్లి అక్కడి ప్రధాని నవాజ్ తో కేక్ చేయలేదు కదా? అని కౌంటర్ ఇచ్చింది. మొత్తంగా రాహుల్ గాంధీ ఇలా నైట్ క్లబ్ లో దొరకడం ఆయన ఇమేజ్ కు డ్యామేజ్ కాగా.. బీజేపీకి ఇదే ఆయుధంగా మారింది.
पहचान कौन ? Who are they ? pic.twitter.com/IDKBkjSg5A
— Kapil Mishra (@KapilMishra_IND) May 3, 2022