Carrot: క్యారెట్ అన్ని నేలల్లో పండుతూ ఉంటుంది. చూడ్డానికి నారింజ వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే క్యారెట్ కొనకుండా ఎవరూ ఉండలేరు. క్యారెట్ అలా నారింజ రంగులో ఉండడానికి ప్రధాన కారణం కెరోటినాయిడ్స్. ఇవి శరీరానికి మంచి చేస్తాయి. ఆహార సమతౌల్యాన్ని కాపాడతాయి. శరీరానికి అవసరమైన గ్లూకోజ్ అందిస్తుంటాయి. దేహం మంచి రూపు రావడానికి ఉపకరిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.. చర్మానికి మంచి మేని ని తీసుకొస్తాయి. పైగా క్యారెట్ లో సహజ సిద్దమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. లావు తగ్గాలి అనుకునే వారు.. సమతౌల్య ఆహారం తినేవారు ఎక్కువగా క్యారెట్ తీసుకుంటారు. క్యారెట్ తో పాటు బీన్స్, ఇతర రకాల చిక్కుడు గింజలను కూడా ఆహారంగా తీసుకుంటారు.
కృత్రిమ రంగు కలుపుతున్నారు
మార్కెట్లో క్యారెట్ కు విపరీతమైన డిమాండ్ ఉండడంతో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి క్యారెట్ కాయలకు కృత్రిమ రంగులను కలుపుతున్నారు. దీనివల్ల ఆ కాయలు మరింతగా మెరిసిపోతున్నాయి. సాధారణంగా క్యారెట్ వంటకాలం నాలుగు నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. అయితే అంతకాలం ఎదురుచూస్తే.. మార్కెట్లో ఆ సమయానికి డిమాండ్ ఉంటుందో లేదో అని భావించి కొందరు పచ్చి కాయలనే తెంపి.. వాటిపై మట్టి లేకుండా చేసి.. కృత్రిమ రంగులను కలుపుతున్నారు. ఆ కాయలను కాళ్లతో కదుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇది 11 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియోని చూసిన చాలామంది షాక్ కు గురవుతున్నారు. ” అరేయ్ అది తినే క్యారెట్ రా.. పచ్చికాయలను కోసి.. వాటికి కృత్రిమ రంగులు అద్ది.. ఇలా మోసం చేస్తున్నారు ఏంట్రా.. అవి తిన్నవారి ప్రాణాలు ఏం కావాలి? ఇకపై మార్కెట్లో క్యారెట్ కాయలను కొనేది లేదు. తినేది కూడా లేదని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. ఐతే ఇలాంటి దారుణాలు ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా జరుగుతాయని కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు.. మరి కొంతమంది అయితే దక్షిణాది ప్రాంతాలలోనూ ఇలానే చేస్తున్నారని మండిపడుతున్నారు. కానీ ఇలాంటి కాయలను తినడం వల్ల అనేక రోగాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ రంగులను క్యారెట్ కాయలపై స్ప్రే చేస్తే అవి ఆరోగ్యం పైను ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంటున్నారు. అందువల్లే క్యారెట్ కాయలను కొనేముందు ఒకరికి రెండుసార్లు సరి చూసుకోవాలని.. రంగులు వాడారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి చేతులతో తాకి చూడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram