Homeట్రెండింగ్ న్యూస్Baby Monkey: మనుషుల్లో మహానీయుడు.. ఇతను చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టడం కూడా తక్కువే

Baby Monkey: మనుషుల్లో మహానీయుడు.. ఇతను చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టడం కూడా తక్కువే

Monkey: రోడ్డు వెంట అలా నడుచుకుంటూ వెళ్తుంటే.. చెప్పులో నుంచి ఒక ముల్లు మన పాదాలకు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా రక్తం ఎగ జిమ్ముకుంటూ వస్తుంది.. నొప్పి ఇబ్బంది పెడుతుంది.. అలాంటిది ఒక బుల్లి కోతి తన మానాన తాను వెళ్తున్నది.. ప్లాస్టిక్ తీగలు కనిపించగానే ఏదో విచిత్రంగా ఉందని పట్టుకుంది.. అలా అందులో చిక్కుకుపోయింది. బయటికి వచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. హా హా కారాలు చేయడం మొదలుపెట్టింది.. అటుగా వెళుతున్న ఒక వ్యక్తి ఆ కోతి బాధను చూసి తట్టుకోలేకపోయాడు. జాగ్రత్తగా ఆ ప్లాస్టిక్ తీగల నుంచి కోతిని బయటకు తీసి కాపాడాడు.. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కోతి పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ కంటికి కనిపించిన ప్లాస్టిక్ తీగలను పట్టుకుంది. అందులో చిక్కుకుపోయింది. ఆ కోతి ఒళ్లంతా గాయాలయ్యాయి. కదలలేని స్థితికి చేరుకుంది. తన సహచర కోతులు పక్కన లేకపోవడంతో సహాయం కోసం అరుపులు చేయడం మొదలుపెట్టింది. ఒకవేళ ఎవరు చూసి ఉండకపోతే అలానే అరచి అరిచి ప్రాణాలు కోల్పోయేది. కానీ అటుగా వెళుతున్న మనుషుల్లో దేవుడు లాంటి వ్యక్తి కంటపడింది ఆ కోతి పిల్ల.

ఆ కోతి పిల్లలు చూడగానే ఆ వ్యక్తి చేతుల్లోకి తీసుకున్నాడు.. భయం లేదు నేను ఉన్నా అని దానికి భరోసా కల్పించాడు. ఆ తర్వాత అతి జాగ్రత్తగా దాని ఒంటి మీద ఉన్న తీగలను తొలగించాడు. దానికి స్వేచ్ఛ కల్పించాడు. ఒళ్ళంతా గాయాలతో ఉన్న కోతిని నీటితో శుభ్రపరచాడు. తర్వాత దానికి ఒక మామిడి పండు ఇచ్చాడు. అయితే అంతకుముందు ప్లాస్టిక్ తీగలలో చిక్కుకుపోయిన కోతి మొదట ఆ మనిషిని చూడగానే తనను ఏదో చేస్తాడని భయపడింది. దగ్గరికి కూడా రానీయలేదు.. తన దేహం పై తీగలను ఒక్కొక్కటిగా తొలగిస్తుండగా తనకు రక్షణగా నిలిచేందుకే వచ్చాడని కోతి అర్థం చేసుకుంది. తర్వాత అతడు తీగలు తొలగిస్తుంటే ఆర్ద్రతతో కూడిన కంటిచూపుతో అతనిని అలాగే చూస్తుండి పోయింది. తర్వాత అతని చొక్కాను అంటిపెట్టుకొని ఉండిపోయింది. అతడి చేతులలో ఒదిగిపోయింది. అంతేకాదు అతడు ఇచ్చిన మామిడి పండును హాయిగా ఆస్వాదించింది.

ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదు చేసుకుంది. అంతేకాదు మానవత్వం అంటే ఏమిటో ఈ వీడియో చాలామందికి అర్థమయ్యేలా చెప్పింది. జంతువుల పట్ల కర్కశంగా వ్యవహరించే వారికి ఇది ఒక గుణపాఠం లాగా నిలిచింది. ” ఆ కోతి అరుపులు నన్ను చాలా బాధించాయి..అతడు దగ్గరికి వెళ్లి చూసేసరికి అది ప్లాస్టిక్ తీగలలో చిక్కుకొని ఉంది. గాయాలు కావడంతో అరుపులు అరుస్తోంది. అతడు తీగలు తొలగిస్తూ కాపాడిన విధానం బాగుంది” అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ” ఒకరికి ఒకరం ఇలా సహాయపడితే ఎంత బాగుంటుందో కదా అని” మరొక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.. ఇలా ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తుండటంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular