Medchal: ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వారిని కనిపెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే అనుకోని రీతిలో వచ్చి పడే ప్రమాదాలు జీవితాంతం బాధపడేలా చేస్తాయి. ఒక్కోసారి చిన్నారుల జీవితాలను కూడా చిత్రం చేస్తుంటాయి. అటువంటి ఘటనే హైదరాబాదులోని కుషాయి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కొబ్బరి మొక్క నోట్లో ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి.
కుషాయిగూడ పరిధిలోని చర్లపల్లి డివిజన్ సోనియా గాంధీ నగర్ లో నివసిస్తున్న శ్రీకాంత్, త్రివేణి దంపతులకు ఇద్దరు కొడుకులు. శ్రీకాంత్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం తొలి ఏకాదశి పండుగ కావడంతో ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి వచ్చారు. గుడిలో కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కలు తెచ్చి ఇంట్లో పెట్టారు. చిన్న కొడుకు జస్వంత్ (3) వాటిలో ఒక్క ముక్క తినేందుకు ప్రయత్నిస్తుండగా నోట్లో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ముక్కను తీస్తుండగానే జస్వంత్ ఊపిరి ఆగిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్ళముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపించారు.
ఐదేళ్ల లోపు పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం..
ఐదేళ్ల వయసు లోపు ఒక పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలని, లేకపోతే తల్లిదండ్రులకు గుండె కోత తప్పదని పలువురు చెబుతున్నారు. పిల్లలు తీసుకునే ఆహారం, ఆడుకునే వస్తువులు తల్లిదండ్రులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదని, ఈ తరహా ఘటనల అనేక చోట్ల జరుగుతున్నప్పటికీ.. తల్లిదండ్రుల అప్రమత్తతతో వ్యవహరించడం లేదని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చిందని పలువురు పేర్కొంటున్నారు.
Web Title: A three year old boy died with a piece of coconut stuck in his throat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com